హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి కడ్డీల రూపంలోని 7 కేజీల బంగారం తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ సుమారు నాలుగు కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read More »భారీగా పెరిగిన పసిడి ధరలు
అంతర్జాతీయంగా పెరిగిన ధరల ప్రభావంతో దేశంలో కూడా ఇవాళ పసిడి ధరలు భారీగా పెరిగాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.320 పెరిగి రూ. 45,820గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగి రూ.42,000గా ఉంది ఇక కేజీ వెండి రూ.900 పెరిగి రూ.71,000గా ఉంది.
Read More »