ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన ప్రముఖ స్టార్ ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ (37) వన్డే క్రికెటు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగాలనే ఆసక్తి, ప్రేమ తనకు లేదని పేర్కొన్నాడు. టెస్టు, టీ20 క్రికెట్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటానన్నాడు. 2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేల్లో 3,618 పరుగులు చేశాడు. 114 వికెట్లు పడగొట్టాడు. 2011 వరల్డ్కప్లో ఇంగ్లాండ్పై కెవిన్ కేవలం 50 బంతుల్లోనే 100 పరుగులు బాదాడు.
Read More »