సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ అతడితో విభేదాల కారణంగా ఏడాది కింద సరూర్ నగర్లోని పుట్టింటికి వచ్చింది. ఈక్రమంలోనే ఇంటి సమీపంలోని ఆలయంలో పూజారిగా పనిచేసే సాయికృష్ణతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తేవడంతో సాయికృష్ణ ఆమెను చంపేశాడు.
Read More »తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి
ఒక ఓటు.. రెండు రాష్ట్రాల నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి చేసిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో పాటు చట్ట సభల్లో కూడా పోరాడిందని తెలిపారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నరు.. ఆయన ఇంకా మాట్లాడుతూ మోదీ పాలన… కుటుంబ, అవినీతిమయమైన పాలన కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా …
Read More »టీబీజేపీ అధ్యక్షుడిగా సరికొత్త పేరు..?
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా డీకే అరుణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి,మాజీ మంత్రి .. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవితోపాటు కీలక అధికారాలు అప్పగించాలన్న ప్రతిపాదనపై చర్చలు సాగుతున్నాయట. …
Read More »సింగరేణి కార్మికులకు దసరా కానుక
2014లో సింగరేణి టర్నోవర్ రూ.11,000 కోట్లు ఉంటే ఇప్పుడది రూ.33,000 కోట్లకు చేరుకుందని గులాబీ దళపతి.. సీఎం కేసీఆర్ మంచిర్యాల సభలో అన్నారు. అదే విధంగా లాభాలు రూ.300-400 కోట్లు మాత్రమే ఉంటే.. ఈ ఏడాది రూ.2,184 కోట్లకు పైగా లాభాలు వచ్చాయన్నారు. ఈ లాభాల వల్ల వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ రూ.700 కోట్లుగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
Read More »సుపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
తెలంగాణ రాష్ట్ర 9 ఏండ్ల సంక్షేమ సుఖ తెలంగాణ 10 ఏండ్లలో అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ సుపరిపాలన దినోత్సవ వేడుకలు ఈరోజు బోథ్ నియోజకవర్గంలోని నూతన మండలమైన భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు …
Read More »సాంబాచారిని పరామర్శించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్టర్, సూర్యాపేట రూరల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాంబా చారిని శనివారం కాసరబాద్ గ్రామంలోని ఆయన నివాసంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట జడ్పిటిసి జీడి బిక్షం, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సంకరమద్ది రమణారెడ్డి, నాయకులు కొల్లు నరేష్, బంటు సైదులు, నాగరాజు, …
Read More »ప్రతి గడపకి సంక్షేమ పథకాల ఫలాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగు పెట్టిన శుభ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పటాన్చెరువు నియోజకవర్గం లోని పాటీ గ్రామ పరిధిలో గల SVR గార్డెన్స్ లో సంక్షేమ సంబురాలు నిర్వహించడం …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదు…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బహదూర్ పల్లి మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన “తెలంగాణ సంక్షేమ సంబురాలు”లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులు బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా తమకు జరిగిన మేలును వివరిస్తూ సీఎం కేసీఆర్ …
Read More »రోడ్ల పునర్నిర్మాణం పనులు చేపడతాం
సికింద్రాబాద్ లో సివరేజ్ వ్యవస్థను ఆధునికరిస్తున్నామని, సివరేజ్ పైప్ లైన్ ల ఏర్పాటు పూర్తి చేసిన వెంటనే రోడ్ల పునర్నిర్మాణం పనులు చేపడతామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. గురువారం రాత్రి చింతబవి లో దాదాపు రూ.70 లక్షల ఖర్చుతో చేపడుతున్న సివరేజ్ పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసురి సునీత, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …
Read More »ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…
జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడా రమేష్ ఈఎన్టీ హాస్పిటల్ వారి సహకారంతో శనివారం భారత నగర్ జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు .అనంతరం కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్ లో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో దశల వారీగా కాలనీలలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ శిబిరంలో సుమారు …
Read More »