మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర,ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వివరించింది.
Read More »మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు
మణిపూర్ అంశంపై ఈరోజు ఉభయ సభలు లోక్ సభ, రాజ్యసభ ల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభ లీడర్ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సభ ప్రారంభమైన దగ్గర నుంచి ఎంపీలు ప్లకార్డులు చేతబట్టుకుని పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఉభయ సభలు స్తంభించాయి. ఈరోజు శుక్రవారం కూడా ఎంపీ నామ నాగేశ్వరరావు ఈ అంశంపై చర్చకు మళ్లీ …
Read More »మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి ఆయా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి పరిస్థితిని వాకోబు చేశారు.వరద ప్రవాహ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, అర్థ రాత్రిళ్లు సైతం పరిస్థితిని సమీక్షించాలని సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు. ఉన్న రక్షణ, సహాయక సౌకర్యాలు వినియోగించి ఎక్కడ కూడా ప్రాణ, నష్టం …
Read More »గోదావరి నదీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భధ్రాచలం వద్ద గోదావరీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సి.ఎస్ శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని …
Read More »డీపీహెచ్ పరిధిలో కొత్తగా 33 పోస్టులను ప్రభుత్వం మంజూరు
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో కొత్తగా 33 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఐదు డీఎంహెచ్‌వోలతోపాటు డీపీహెచ్ రాష్ట్ర కార్యాలయంలో 28 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరు చేసిన డీఎంహెచ్‌వోలన్నీ హైదరాబాద్ జిల్లా పరిధిలోనివే. సుమారు కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఒక్క డీఎంహెచ్‌వో పోస్టుతో పర్యవేక్షణ కష్టంగా మారిందని, జీహెచ్‌ఎంసీ తరహాలో ఆరు …
Read More »కరెంటు కోతలు + కారుకూతలు = కాంగ్రెస్ నేతలు
గత పాలకులు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం పండుగగా మార్చింది. అది చూసిన కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నయి. వాళ్ల నాలుక మీద ముండ్లు మొలుస్తున్నయి. సత్యం మింగుడు పడక సతమతమైతున్నరు. అజీర్తిని తట్టుకోలేక ఆగమాగమైతున్నరు.తెలంగాణ ప్రభుత్వం సాధించిన విద్యుత్తు విజయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు గాయిగత్తర లేపుతున్నరు. తమ పాలనా కాలంలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తాయిమాయి అవుతున్నరు. బీఆర్‌ఎస్ వచ్చిన తర్వాత వ్యవసాయానికి …
Read More »ఫతేనగర్ డివిజన్ పరిధిలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మూసాపేట్ సర్కిల్ లోని ఫతేనగర్ డివిజన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్, భరత్ నగర్ నాలా పరిసర ప్రాంతాలు రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రెండు రోజుల పాటు భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. కాగా ఫతేనగర్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో జన జీవనం స్తంభించిందని …
Read More »జీవాలకు అవసరమైన అన్ని మందులు పశువైద్యశాలలో అందుబాటులో ఉంచాలి-మంత్రి తలసాని
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులు, ఇతర జీవాలు వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బి ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జీవాలకు అవసరమైన అన్ని మందులు పశువైద్యశాలలో అందుబాటులో ఉంచాలని, పశు …
Read More »మాజీ మంత్రి సి. రామచంద్రారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రి, అదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, చిలుకూరి రామచంద్రా రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజాదరణ పొందిన నేతగా వారు అందించిన స్పూర్తి గొప్పదని సిఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ మంత్రి సి. రామచంద్రారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని …
Read More »భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి – సి.ఎస్ శాంతి కుమారి
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ పరీ వాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు రాత్రి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ టెలీ కాన్ఫరెన్స్ లో డీజీపీ అంజనీ కుమార్, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ …
Read More »