తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఎంతో మంది సీఎంలు వచ్చినా ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని దేశంలోనే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.సీఎం కేసీఆర్ …
Read More »దేశంలో కొత్తగా 3,06,064 మందికి కరోనా
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కరోనా ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 3,06,064 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోల్చితే 27,469 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 17.78శాతం నుంచి 20.75శాతానికి చేరుకుంది. 439 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22,49,335 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »గ్రీన్ఇండియా చాలెంజ్ లో నటి మాధవి లత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో మొక్కలు నాటారు ప్రముఖ సినీ నటి మాధవి లత.. ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ ఇంటి …
Read More »విజయవంతంగా కొనసాగుతున్న ఫీవర్ సర్వే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్ళ సంఘం డైరీని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోకపేట్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సెక్రెటరీ బలరాం యాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాళ్ళ సంఘం అధ్యక్షులు కే ఎస్ రామారావు, జనరల్ సెక్రెటరీ కళింగ కృష్ణ కుమార్, అసోసియేట్ …
Read More »కొత్త జోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్ -ఎడిటోరియల్ కాలమ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందుకే తెలంగాణ మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగసింది. 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమానికి కేంద్ర తల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వనరులను సద్వినియోగం చేసుకోవడం మీద దృష్టి సారించారు. రూ. లక్ష పై చిలుకు కోట్లతో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి …
Read More »సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుముల లేఖ రాశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, మిగతా పంటలకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలన్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన గత 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించారు.ఇందులో కొత్తగా 4,416 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,920 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది- మంత్రి సత్యవతి రాథోడ్
దేశంలో గిరిజనులు, దళితులకు మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.ఎస్సీ,ఎస్టీలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ములుగులో ట్రైబల్ వర్సిటీని ఇంతవరకు కేంద్రం నిర్మించలేదని తెలిపారు. పోడు భూముల సమస్యపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు పెండింగ్లో పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.
Read More »తెలంగాణలో ఆ ధరలను తగ్గించాలి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కరోనా టెస్టుల ధరలను తగ్గించింది. గతంలో రూ.499గా ఉన్న కరోనా టెస్టు ధరను రూ.350కి తగ్గించింది. దీంతో తెలంగాణలో కూడా ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలంటున్నారు. కాగా తెలంగాణలో కరోనా టెస్టుల కోసం కొన్ని ల్యాబ్లో రూ.500 నుంచి రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 4,207 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,20,215 కరోనా పరీక్షలు చేయగా.. 4,207 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,825 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,633 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.75శాతంగా ఉంది.
Read More »