ప్రభుత్వం వైద్యంలో 18-59 వయస్సు వారికి కరోనా నుంచి రక్షణకు ప్రికాషనరీ డోస్ ఇవ్వడానికి అనుమతివ్వాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. భవిష్యత్‌లో కొత్త వేరియంట్ల ద్వారా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో, రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుక్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. ఈ …
Read More »కంఠమేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి భూమి పూజ…..
వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ తిమ్మాపూర్ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ కంఠమేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read More »పది తరాలు పనికొచ్చే పని చేసేందుకు బయలుదేరిన
వచ్చే వానాకాలం లోపు వంద ఏకరాలు ఆయిల్ ఫామ్ తోటలు నాటాలని గ్రామస్తులను మంత్రి హరీశ్ రావు కోరారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం అప్పలాయచెరువు గ్రామంలో బుధవారం ఉదయం అభయాంజనేయ స్వామి, శివ పంచాయతన నవగ్రహా, నాగదేవత ప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆంజనేయ …
Read More »నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్
తెలంగాణలోని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవని తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌కమిషన్ ప్రకటించింది. ఇంటర్వ్యూలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పోలీసు ఉద్యోగాలకు ఏజ్ లిమిట్‌ను మరో మూడేళ్లకు పెంచింది. టీఎస్‌పీఎస్సీ తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూల ఎత్తివేతపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ …
Read More »యాసంగి ధాన్యం ప్రతి గింజా మేమే కొంటాం: కేసీఆర్
ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రానంత మాత్రాన తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. యాసంగిలో ప్రతి గింజా తామే కొంటామని చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,960 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు …
Read More »రాష్ట్రంలో 6 ప్రైవేట్ యూనివర్సిటీలు… 111 జీవో ఎత్తివేత: కేసీఆర్
రాష్ట్రంలో 6 ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కావేరి అనే అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు అమిటీ, సీఐఐ, గురునానక్, ఎంఎన్‌ఆర్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించి జీవో 111ను ఎత్తివేస్తామని కేసీఆర్ తెలిపారు. దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో …
Read More »24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాలో తెలంగాణ ఘనత-నీతి ఆయోగ్ నివేదిక..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యుత్ లభ్యత, ధర, విశ్వసనీయతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్, పర్యావరణ సూచిక రౌండ్-1 ర్యాంకింగులో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం రెండో …
Read More »సీఎస్ సోమేష్ కుమార్ కు ఎమ్మెల్సీ కవిత పరామర్ష
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి శ్రీమతి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. ఈ రోజు పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి హైదరాబాద్ లోని సోమేష్ కుమార్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, మినాక్షి సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More »నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టి-క్యాబినేట్ భేటీ..తీసుకునే నిర్ణయాలు ఇవేనా…?
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. నిన్న సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదిక రైతు ధర్నాను నిర్వహించిన సీఎం కేసీఆర్ కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణ రైతాంగం యాసంగిలో పండించిన వడ్లను కొనే అంశం గురించి నిర్ణయాన్ని చెప్పాలని …
Read More »TSRJC ఎంట్రన్స్ దరఖాస్తులకు గడవు పెంపు
తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకుగాను దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. 2022–23 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం ప్రవేశాల గడువును పెంచామని వెల్లడించారు.
Read More »