Home / TELANGANA (page 223)

TELANGANA

మేం అడ్డుకుంటే బీజేపీ నేతలు తిరగలేరు: బాల్క సుమన్‌

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వచ్చిన సందర్భంగా శంషాబాద్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. టీఆర్ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడారు. అడ్డుకోవడమే పని అయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో …

Read More »

‘మన ఊరు- మన బడి’ పనులు త్వరగా పూర్తిచేయాలి: మంత్రి సబిత

వేసవి సెలవుల్లో పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులును ఆదేశించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై మంత్రి సబిత అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. అధికారుతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లిదయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ‘మన ఊరు-మన బడి’ పురోగతిపై చర్చించారు. మొదటి విడతలో చేపట్టిన పనులను జూన్‌ 12 నాటికి పూర్తిచేయాలని మంత్రి …

Read More »

తలసేమియా రహిత రాష్ట్రంగా తెలంగాణ‌ను తీర్చిదిద్దుతాం

త‌ల‌సేమియా వ్యాధి బారిన ప‌డిన పిల్ల‌ల‌ను చూస్తుంటే బాధ క‌లుగుతుంద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆరోగ్య శ్రీ కింద అలాంటి పిల్ల‌లంద‌రికీ ఉచిత వైద్యం అందిస్తున్నామ‌ని తెలిపారు.తలసేమియా, సికెల్ సెల్ సోసైటీ ఆధ్వర్యంలో కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన స‌ద‌స్సుకు మంత్రి హ‌రీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. తెలంగాణలో కమలా సోసైటీ తలసేమియా రోగులకు మంచి సేవ అందిస్తోంద‌ని …

Read More »

పంట మార్పిడితో అధిక దిగుబడులు : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్ప‌ష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో చిరుధాన్యాలకు సంబంధించిన పంట‌ల‌ను వేయాల‌ని సూచించారు. అదే విధంగా పంట మార్పిడితో …

Read More »

తెలంగాణలో 24గంటల కరెంటు

తెలంగాణలో ఎక్కడ కూడా కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను… హైదరాబాద్‌లో జెనరేటర్ పెట్టుకునే పరిస్థితి లేదు’’ అని తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లిలో జెనరేటర్ వాడినట్టు ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో తాగు నీరు, కరెంట్ సమస్య ఎక్కడా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు అంటే …

Read More »

మన ఊరు- మన బడిపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలి

విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని గ్రౌండ్ లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృడంగా తయారు అవుతారని …

Read More »

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ మంత్రి ఆర్కే రోజా కలిశారు. తన కుటుంబంతో కలిసి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. కేసీఆర్‌కు ఆయన ఫొటో ఫ్రేమ్‌ను జ్ఞాపికగా రోజా అందజేశారు. అంతకుముందు రోజాకు సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత స్వాగతం పలికారు. భర్త సెల్వమణి, కుమార్తె, కుమారుడితో కలిసి …

Read More »

నేడు ఢిల్లీకి న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుక్ర‌వారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భ‌వ‌న్ లో జ‌ర‌గ‌నున్న న్యాయ స‌ద‌స్సులో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన‌నున్నారు. సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశానికి ప‌లు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. నేషనల్ జ్యూడిషీయల్ ఇన్ఫ్రాస్టక్టర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలో …

Read More »

సంపద సృష్టిస్తున్నాం.. ప్రజలకు పంచుతున్నాం: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేలు అని, ఏడేండ్ల తర్వాత అది రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయం తరువాత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat