కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ రైసింగ్ స్టార్ హైస్కూల్ వద్ద భూగర్భ డ్రైనేజీ సమస్యపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో బస్తీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని …
Read More »బండి సంజయ్ అలాంటి ఆరోపణలు చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు: కేటీఆర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాస్యాస్పద, ఆధార రహిత, బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాసంగ్రామ యాత్రలో సంజయ్ చేసిన వ్యాఖ్యపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్ నిర్వాకమే కారణమంటూ సంజయ్ చేసిన కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. ఏమైనా ఆధారాలుంటే ప్రూవ్ చేయాలని.. వాటిని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని సవాల్ విసిరారు. …
Read More »కాల్‌వే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన కాల్‌వే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో డిజిటెక్ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఆపిల్, గూగుల్, ఉబర్, నోవార్టిస్ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని చెప్పారు. ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్‌లు …
Read More »MLA Kpను కలిసిన సుభాష్ నగర్ ఆటో స్టాండ్ అసోసియేషన్ సభ్యులు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ 130 డివిజన్ కు చెందిన సుభాష్ నగర్ ఆటో స్టాండ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం …
Read More »కర్ణాటకలో ఆ ప్రాజెక్టుల పర్మిషన్ నిలిపేయండి: తెలంగాణ అభ్యంతరం
అంతర్రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా కర్ణాటకలోని ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రం జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కర్ణాటకలో చేపడుతున్న అప్పర్‌తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన పర్మిషన్‌ను నిలిపివేయాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంజినీర్ ఇన్‌చీఫ్ (ఈఎన్‌సీ) మురళీధర్ లేఖ రాశారు. కర్ణాటకకు అనుమతిస్తే తుంగభద్ర నుంచి కృష్ణాకు …
Read More »ఆ ఆరోపణలు నిజం కావు.. వాటిని నమ్మొద్దు: గంగుల కమలాకర్
ధాన్యం కొనుగోళ్లకు గన్నీ బ్యాగుల కొరత ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు నిజం కావని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రస్తుతం 8.85 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా.. వాటిలో ఇప్పటివరకు కేవలం 2.5కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే వాడామని చెప్పారు. మిగిలిన 6.35కోట్ల బ్యాగులతో 25లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయొచ్చన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. అసని …
Read More »వరంగల్‌లో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్ సందడి
సినీ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ వరంగల్‌లో సందడి చేశారు. వరంగల్ చౌరస్తాలోని జేపీఎన్ రోడ్‌లో కొత్తగా కాసం గ్రూపు ఏర్పాటు చేసిన వర్ణం షాపింగ్ మాల్‌ను నాగ చైతన్య, అను ఇమ్మాన్యుల్ కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే నాగచైతన్య, …
Read More »తక్కువ అద్దెకే రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు
తెలంగాణలో రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలను తక్కువ ధరకే కిరాయికి ఇచ్చేందుకు వీలుగా ప్రతి గ్రామీణ మండలంలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్(సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణ బాధ్యతలను మహిళా మండల సమాఖ్యలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో 536 గ్రామీణ మండలాలు ఉండగా ఇప్పటికే 131 మండలాల్లో సీహెచ్‌సీలను ఏర్పాటుచేశారు. మిగిలిన 405 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున సీహెచ్‌సీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క మండలానికి గరిష్ఠంగా రూ.30 …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త-త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు
తెలంగాణలో వైద్యారోగ్య వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్‌ను, మొబైల్ యాప్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ …
Read More »టీ – డయాగ్నోస్టిక్ హబ్‌ను ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగిలో టీ – డయాగ్నోస్టిక్ హబ్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. టీ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్‌ను కూడా మంత్రి ఆవిష్కరించారు. వైద్య పరీక్షల వివరాలను మొబైల్ యాప్‌లోనే తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో విప్లవాత్మకమైన చర్యలకు సీఎం కేసీఆర్ శ్రీకారం …
Read More »