Home / TELANGANA (page 208)

TELANGANA

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ నారాయణ రెడ్డి కాలనీ మరియు సిరి ఎంక్లేవ్ లలో స్థానిక సమస్యలపై ఈరోజ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణంను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో ఆచార్య కుంట నుండి బాటా షో రూం వరకు ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో చేపడుతున్న వర్షపు నీటి నాలా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేలా …

Read More »

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అసమ్మతి నేతలు, సీనియర్లు ఝలక్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అసమ్మతి నేతలు, సీనియర్లు ఝలక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.పార్టీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి లేకుండానే కీలకమైన మేధోమథన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి లేకుండానే కీలకమైన మేధోమథన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. అమెరికా టూర్‌లో ఉన్న రేవంత్‌ తాను వచ్చాక ఈ సమావేశాన్ని నిర్వహిద్దామని చెప్పినప్పటికీ సీనియర్లు పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయన లేకుండా జూన్‌ 1,2 తేదీల్లో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల కాంగ్రెస్‌ కేంద్ర …

Read More »

అమరుల స్మారక చిహ్నంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ అని.. ఆ నిర్మాణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ విధించిన గడువులోపు ఆ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులర్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని.. అమరుల త్యాగాలు …

Read More »

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వాటర్‌ బాటిల్స్‌!

ప్రయాణికుల కోసం వాటర్‌ బాటిళ్లు తయారు చేసి విక్రయించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. దీని కోసం మంచి డిజైన్‌ను సూచించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మంచి వాటర్‌ బాటిల్‌ డిజైన్‌ సూచించి ప్రైజ్‌ మనీ గెలుచుకోవాలని సజ్జనార్‌ కోరారు. ప్రయాణికుల కోసం అరలీటర్‌, లీటర్‌ పరిమాణాల్లో ఈ వాటర్‌ బాటిళ్లను అందజేయనున్నారు. ఆర్టీసీ తీసుకొస్తున్న ఈ మార్పులకు తోడ్పాటు అందించాలని ప్రజలకు …

Read More »

తెలంగాణ కమ్మ సేవా సమితి (TKSS)ఆధ్వర్యంలో ఘనంగా NTR శత జయంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ,తెలుగు సినిమా ఇండస్ట్రీ లెజండ్రీ నటుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు రాష్ట్రంలోని మియాపూర్  ప్రగతి ఎంక్లేవ్ కళామండపంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు ముఖ్య అతిథిగా ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ Tv5  ఇన్ ఫుట్ ఎడిటర్ టీవీ5 మూర్తి గారు ,TKSS  అధ్యకులు మొవ్వ …

Read More »

భావితరాలకు ఎన్టీఆర్‌ ఆదర్శం

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.తెలుగుప్రజలు గర్వించేలా సినీ, రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్రను నందమూరి తారక రామారావు సృష్టించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత గమనాన్ని ఈ సందర్భంగా మంత్రి అజయ్ మననం చేసుకున్నారు.అధికారం అన్నది …

Read More »

తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్

తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నటసార్వభౌమునికి భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి మల్లారెడ్డి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తారన్నారు. సీఎం కేసీఆర్‌.. ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నారని చెప్పారు.ఎన్టీఆర్‌‌కి భారత …

Read More »

మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో రుతు ప్రేమ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. ఈ మేరకు ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంతో పాటు స్వచ్ఛ సిద్ధిపేట జిల్లాకు పాటు పడదామని దిశానిర్దేశం చేశారు.మీ నిశ్శబ్దం వీడండి. బహిరంగంగా చర్చించండి. రుతుప్రేమ ప్రయోజనాలు వివరించండి. రుతుప్రేమ లేకపోతే.. జీవనమే లేదు. …

Read More »

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారని అన్నారు. సినీ నట …

Read More »

ఆరోజు నుంచే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి..: మంత్రి మల్లారెడ్డి

రానున్న దసరా రోజు నుంచి దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్‌ వెళ్తారని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఆయనకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దసరా రోజున వరంగల్‌లని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి నేషనల్‌ పాలిటిక్స్‌లో కేసీఆర్‌ అడుగుపెడతారని చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించి కార్మిక సదస్సులో మల్లారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat