దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్రమైన శూన్యత నెలకొని ఉన్నది. సమర్థమైన నాయకత్వ శూన్యత స్పష్టంగా ఉన్నదన్నది నిపుణుల మాట. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలం జాతీయస్థాయిలో ప్రభావవంతంగా లేదు. అటు కీలకమైన కాంగ్రెస్ పార్టీ దీటుగా స్పందించే స్థితిలో లేదు. సోషలిస్టుల ప్రాభవం పూర్తిగా కనుమరుగైంది. ములాయం, లాలూ, శరద్‌యాదవ్ వంటి దిగ్గజాల వారసులు తమ తమ ప్రాంతాలను దాటి జాతీయ స్థాయికి ఇంకా అడుగులు వేయడం లేదు. జనతా …
Read More »సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల సవాల్
తెలంగాణలో సమస్యలే లేవని చెబుతున్న ముఖ్యమంత్రి,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీ రామారావులు ఒక్కరోజు తనతో పాదయాత్రకు వస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపిస్తానని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. సమస్యలు లేకుంటే తాను ముక్కు నేలకు రాసి వెళ్లిపోతానని, సమస్యలు చూపిస్తే కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా ? అని సవాల్ విసిరారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా …
Read More »రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చేశారు: జీవన్‌రెడ్డి
గవర్నర్ తమిళిసై ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని.. రాజ్‌భవన్‌ను ఆమె రాజకీయ భవన్‌గా మార్చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. అది ప్రజాదర్బార్ కాదని.. పొలిటికల్ దర్బార్ అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలని ఆయన …
Read More »ఖమ్మం వేదికగా యువతకు మంత్రి కేటీఆర్ పిలుపు
ఖమ్మం నగరంలోని లకారం చెరువుపై రూ. 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ వంతెన, మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్, రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ శ్రీ నామా నాగేశ్వర్ రావుతో కలిసి మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.ఇవాళ మన దేశంలో ఏం జరుగుతుందో యువత …
Read More »బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలకు దిగారు. గత 8 ఏళ్లలో బీజేపీ నేతలు, వారి బంధువులపై ఎన్నిసార్లు ED, IT & CBI దాడులు జరిగాయని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అంటే సత్య హరిశ్చంద్రుని బంధువులంతా బీజేపీకి చెందినవారేనా? అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Read More »మంత్రులు, ఎంపీలతో కేసీఆర్ కీలక భేటీ..
రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పాలన. రాజకీయ పరమైన అంశాలపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతల అభిప్రాయాలను కేసీఆర్ తెలుసుకుంటున్నట్లు సమాచారం.
Read More »వాళ్లను కూడా మేజర్లగానే పరిగణించాలి: జూబ్లీహిల్స్ ఘటనపై కేటీఆర్ ట్వీట్
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో మైనర్లను మేజర్లుగానే పరిగణించి శిక్షించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. మైనర్‌గా ఉన్న వ్యక్తులు మేజర్‌లా క్రూరంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి పాల్పడితే వాళ్లను కూడా మేజర్‌గానే పరిగణించాలని.. జువైనల్‌గా చూడొద్దని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Read More »జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్‌పై కీలక అప్‌డేట్
జూబ్లీహిల్స్‌లో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లలో ముగ్గురిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో ఆ నిందితులను పోలీసులు రేపటి నుంచి విచారించనున్నారు. లాయర్ సమక్షంలో విచారించి నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. మరోవైపు నిందితులైన ఐదుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరనున్నట్లు సమాచారం.
Read More »దాంతో తెలంగాణకు కేంద్రం పెద్ద దెబ్బ కొట్టింది: కేటీఆర్
ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో హామీ ఇచ్చారని.. అది ఏమైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32లక్షల జాబ్స్ భర్తీ చేసిందని.. త్వరలో మరో లక్ష చేస్తుందని చెప్పారు. ప్రైవేట్ …
Read More »ఆర్టీసీకి ఊపిరి పోసింది సీఎం కేసీఆర్ -మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
సమైక్య పాలనలో ఆర్టీసీ కొత్త డిపోలకు నోచుకోలేదని, తెలంగాణలో ఆర్టీసీని సీఎం కేసీఆరే బతికించారని మంత్రి అజయ్‌కుమార్ చెప్పారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్.. బడ్జెట్‌లో సంస్థకు నిధులు కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. సంస్థ బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు. కార్గో ద్వారా ఆర్టీసీకి ఆదాయం సమకూరుతున్నదని తెలిపారు. నర్సాపూర్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్ని బస్సులు అవసరం ఉన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. …
Read More »