Home / TELANGANA (page 200)

TELANGANA

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద గుడాటిపల్లి నిర్వాసితులు ధర్నాకు దిగారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములిచ్చిన తమకు ప్యాకేజీ ఇవ్వకుండా అధికారులు ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భూ నిర్వాసితులు వారిపై దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

Read More »

సింగిల్‌ స్టాప్‌ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరానికి వస్తున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భాగ్యనగరం సింగిల్‌ స్టాప్‌ డెస్టినేషన్‌గా మారిందని.. తయారీ రంగానికి అడ్డాగా మారబోతోందని చెప్పారు. హైటెక్‌ సిటీలో జాన్సన్‌ కంట్రోల్‌కు చెందిన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ టీహబ్‌ హైదరాబాద్‌లో ఉందని.. ఇమేజ్‌ టవర్స్‌ను సైతం నిర్మిస్తున్నామని …

Read More »

సూరారం డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని టీఎస్ఐఐసి కాలనీలో ఈరోజు పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. స్థానిక సమస్యలపై పాదయాత్ర చేయగా.. మిగిలిన సీసీ రోడ్లు, చిల్డ్రన్స్ పార్క్ వద్ద కాంపౌండ్ వాల్, మొక్కల పెంపకం, సీనియర్ సిటిజన్స్ కల్చరల్ బిల్డింగ్, సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్, చిల్డ్రన్స్ పార్క్ లో పిల్లల ఆట సామగ్రి, లైబ్రరీ ఏర్పాటు వంటి సమస్యలను …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలోని ఉన్నత విద్యా శాఖలో భర్తీ చేసేందుకు 5,083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వీటి భర్తీని సత్వరమే నోటిఫై చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. వాటిలో యూనివర్సిటీల్లో అత్య ధికంగా 1,892 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ కమిషనరేట్ (1,523), కళాశాల విద్య కమిషనరేట్ (546), సాంకేతిక విద్య కమిషనరేట్ (568), 11 యూనివర్సిటీల పరిధిలో 2,374 పోస్టులు ఖాళీగా …

Read More »

విద్యార్థులకు వారానికి 3 సార్లు కోడి గుడ్లు

తెలంగాణలోని సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థులకు వారానికి 3 సార్లు కోడి గుడ్లను తప్పనిసరిగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. వేడిగా ఉన్న ఆహారమే వడ్డించాలని.. ముందుగా హెడ్మాస్టర్, టీచర్లు రుచి చూడాలని సూచించారు. పోషక విలువల గల భోజనం పెట్టాలన్నారు. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు విద్యార్థులకు ఇచ్చే కోడిగుడ్ల సేకరణ ధరను ప్రభుత్వం రూ.4 నుంచి రూ.5కు పెంచింది.

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో  మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఆఫీస్, ఇతర ప్రాంతాలకు మెట్రోలో ప్రయాణించే వారు ఇక నుంచి మడత పెట్టే సైకిళ్లను తమవెంట తీసుకువెళ్లవచ్చు. ఈ మేరకు మెట్రో రైలు సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే సైకిల్ బ్యాగు సైజ్ 60/45/25 సెం.మీలు.. బరువు 15 కిలోలకు మించకుండా ఉండాలని నిబంధన విధించింది. దీనికి ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. మెట్రో దిగిన తర్వాత …

Read More »

జీడిమెట్ల డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భూమిరెడ్డి కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారు పర్యటించారు. ఈ మేరకు పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. కాగా మిగిలిన 100 మీటర్లు రోడ్డు, డ్రైనేజీ మాన్ హోల్స్ ప్లాస్ట్రింగ్, విద్యుత్ స్తంభాలు, రోడ్డు నెంబర్ 3,4లలో మిగిలిన వాటర్ లైన్స్ వంటి …

Read More »

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భోళాశంకర్ నగర్ లో రూ.1.35 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన …

Read More »

మిగతా వాళ్లకీ బూస్టర్‌ డోసు ఇవ్వండి: కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్‌

18 ఏళ్లు నిండిన వారందరికీ గవర్నమెంట్‌ హాస్పిటళ్లలో బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్‌ మాట్లాడారు. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్నందన అర్హులైన వారంద‌రికీ బూస్ట‌ర్ డోస్ ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాష్ట్రంలోని అన్ని …

Read More »

నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వైఎస్సారే: కొండా సురేఖ

ఈరోజుల్లో తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి దివంగత సీఎం, ప్రజానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్లేనని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన ‘కొండా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన ఆమె.. అక్కడ కంట్రోల్‌రూమ్‌ ఎదురుగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉందని.. వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat