Home / TELANGANA (page 197)

TELANGANA

ఆర్మీని కూడా ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తున్నారు: హరీష్‌రావు

‘అగ్నిపథ్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా అట్టుడికిపోతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా మోతెలో పీహెచ్‌సీ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లను టీఆర్‌ఎస్‌ చేయించిందంటూ బండి సంజయ్‌చేసిన ఆరోపణలపై హరీష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్‌ చేయిస్తే యూపీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి ఎవరు చేశారని సూటిగా ప్రశ్నించారు. అగ్నిపథ్‌ విధానం యువకులకు అర్థం కాలేదంటూ …

Read More »

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తప్పిన ఘోర ప్రమాదం

కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్  ఆందోళనల సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలో ఆర్మీ అభ్యర్థులు పలు రైళ్లకు నిప్పు పెట్టిన సందర్భంలో పెను ప్రమాదం తప్పింది. ప్లాట్ ఫామ్ పై నం-1పై ఉన్న రైలు బోగీకి నిప్పంటించగా దానికి అతిసమీపంలోనే రైళ్లలో నింపే డీజిల్ ట్యాంక్ ఉంది. ఘటన సమయంలో అందులో 20వేల లీటర్ల డీజిల్ ఉంది. దానికి మంటలు అంటుకుని ఉంటే …

Read More »

సికింద్రాబాద్ అగ్నిపథ్ అల్లర్ల సూత్రదారి అరెస్ట్

కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని దక్షిణమధ్య రైల్వే కేంద్రమైన  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై  ఏపీకి చెందిన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసారావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీని నడుపుతున్న సుబ్బారావు.. ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో తన సొంతూరు ఖమ్మంలో ఉన్నట్లు తెలుసుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. …

Read More »

ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

 ఈ నెల 19న  ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐదేండ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లిదండ్రులకు అన్ని బస్‌ సర్వీస్‌ల్లో ఆ ఒక్కరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Read More »

రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్‌ రావు నివాళులు

కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్  ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్‌ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌ రెడ్డి, బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్‌ నివాళులు అర్పించారు.రాకేశ్‌ మృతికి నిరసగా నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాకేశ్‌ మృతదేహంతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ …

Read More »

బీజేపీ సర్కార్‌ అన్ని వర్గాలను అణగదొక్కుతుంది

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌ అన్ని వర్గాలను అణగదొక్కుతున్నదని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రాకేశ్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్‌ మృతదేహానికి ఎంజీఎం దవాఖానలో నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం మొండి వైఖరిని అందరూ ఖండించాలన్నారు. సైన్యంలో కూడా ఔట్‌సోర్సింగ్‌ విధానం తీసుకురావడం …

Read More »

యోగాతో శరీరానికి ఎంతో మేలు

ప్రతి రోజూ మనం  చేసే యోగాతో మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో నిర్వహించిన పాదయాత్రలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగ ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా …

Read More »

ఉమ్మడి పాలమూరులో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు శనివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్‌ర్నూల్, కొల్లాపూర్ పట్టణాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొల్లాపూర్‌లో సింగోటం నుంచి గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే రూ.147 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు కొల్లాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడతారు. మధ్యాహ్నం ఒంటి …

Read More »

దుర్మార్గపు ఆలోచనలతోనే ‘అగ్నిపథ్‌’: నారాయణ

నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. దాని ఫలితమే దేశంలో హింసాకాండ అని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నారాయణ స్పందించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ను అర్ధంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను మాయ చేసేందుకు దుర్మార్గపు ఆలోచనలతోనే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని నారాయణ విమర్శించారు.

Read More »

బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద రేవంత్‌రెడ్డి అరెస్ట్‌

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న రేవంత్‌రెడ్డి పోలీసులను దాటుకుని క్యాంపస్‌లోనికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ తర్వాత వారి నుంచి తప్పించుకుని గోడదూకి లోనికి ప్రవేశించారు. విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి రేవంత్‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat