తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గురుకులకు చెందిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రయివేటు స్కూళ్లను దాటేసి విజయఢంకా మోగించారు. మొన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ గురుకుల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించి మొదటి వరుసలో నిలిచారు. ఇవాళ విడుదలైన టెన్త్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు అత్యధికంగా 99.32 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు …
Read More »జులై 2న హైదరాబాద్‌కు రానున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కి ఘనస్వాగతం
జులై 2వ తేదీన హైదరాబాద్‌కు రానున్నరు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి శ్రీ యశ్వంత్ సిన్హా.ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హాకు స్వాగత ఏర్పాట్లు, ఆయనకు మద్ధతుగా నిర్వహించే సభపై హైదరాబాద్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ .యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలకాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ …
Read More »రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు: నిరంజన్‌రెడ్డి
అర్హులైన లబ్ధిదారులందరికీ ‘రైతుబంధు’ కింద ఆర్థికసాయం జమ చేస్తున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. ఎక్కువ భూమి ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందనేది అవాస్తమని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. రైతుబంధుపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదో విడత రైతుబంధు కింద రూ.7,508కోట్లు అందిస్తున్నామని మంత్రి …
Read More »సికింద్రాబాద్‌లో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ పేరుతో భారీ ఫ్లెక్సీ
ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ చేసిందేమీ లేదంటూ సికింద్రాబాద్‌లో భారీ ఫ్లెక్సీ వెలిసింది. జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ బహిరంగసభ జరగనుంది. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు. అయితే మోదీ 8 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదంటూ టివోలీ థియేటర్ సిగ్నల్ సమీపంలో ఎవరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నోట్ల రద్దు, ప్రభుత్వసంస్థల అమ్మకం, అగ్నిపథ్, రైతు …
Read More »వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మన ఊరు- మన బడి, కరెంట్, మంచినీరు సరఫరా, వివిధ మరమ్మతులు, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు వంటి సదుపాయాల కోసం మొత్తం రూ.40లక్షల 19 వేలతో శంకు స్థాపనలు చేశారు.రూ.80 లక్షల నిధులతో …
Read More »ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలపై …
Read More »రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంలోని భాగంగా రైతన్నకు పంటపెట్టుబడి కింద అందించే ఆర్థికసాయం తొమ్మిదో విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ రోజు మంగళవారం మొదలైన రైతుబంధు నగదు జమలోని భాగమ్గా తొలి రోజు ఎకరాలోపు పొలం ఉన్న 19లక్షల 98వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.586 కోట్లు పడ్డాయి. రేపటి నుంచి ఆరోహణ …
Read More »తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు మంగళవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్లో 63.32%, సెకండియర్లో 67.82% ఉత్తీర్ణత నమోదైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.అయితే మొదటి సంవత్సరంలో 2,33,210 మంది అమ్మాయిలు రాస్తే 1,68,692 మంది (72.33%) …
Read More »ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలకు చెందిన సుమారు 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »PV కి భారతరత్న ఇవ్వాలి-మంత్రి తలసాని
భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహా రావు 101 జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన పీవీని కేంద్రం విస్మరించడం …
Read More »