హైదరాబాద్ నగరవాసులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నగర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచే వర్షం పడుతోంది. నగరంతో పాటు తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. భారీ వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు …
Read More »గుడ్ న్యూస్: రేట్ తగ్గిన వంట నూనె.. అమల్లోకి ఎప్పుడంటే!
సామాన్యులకు కేంద్రం తీపికబురు చెప్పింది. వంట నూనె రేటును లీటరుకు రూ.15 తగ్గించింది. ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తగ్గిన ధరల ప్రయోజనాన్ని వెంటనే ప్రజలకు అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్రం ఆదేశించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం మేరకు పామాయిల్, సోయాబీన్, రైస్ బ్రాన్ ఆయిల్ రేట్లను 5 నుంచి 11 శాతం తగ్గించింది.
Read More »హైదరాబాద్ లో దారుణం.. ఓ యువతిని ప్రేమించి… మరో యువతిని…?
తనను మోసం చేసిన వ్యక్తిపై బాధిత యువతి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని షీటీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. షీ టీం పోలీసుల వివరాల ప్రకారం..నగరంలోని మాదాపూర్ లో ఆపరేటర్ గా పని చేస్తున్న అఖిల్ ఓ యువతిని ప్రేమించాడు.. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. తనను మోసం చేశాడని బాధిత యువతి షీటీంకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజమని తేలింది.. …
Read More »హైదరాబాద్ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్ తన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) కేంద్రాన్ని ఏర్పాట చేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకుంది. 15 కోట్ల అమెరికన్ డాలర్లతో ఈ విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాన్ని శాఫ్రాన్ ఏర్పాటు చేస్తుంది. ఇండియాలో తన …
Read More »ప్రజలపై ఆర్ధిక భారం మోపుతున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కేంద్ర ప్రభుత్వం మరోసారి రూ.50 పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ లో మహిళా నాయకురాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు. మహిళలు ఖాళీ సిలిండర్ ల ముందు మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్ధిక భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. …
Read More »ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి
ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో ఉన్న బేయర్ పత్తి విత్తన, జెన్యు పరిశోధన కేంద్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమకు అది మూలాధారహని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల పత్తిపంటల్లో 90 శాతం గాస్పియం …
Read More »దోబిఘాట్, రాచకొండ స్మశానవాటిక అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని గాజులరామారం దోబిఘాట్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని రజకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దోబిఘాట్ లో షెడ్డు ఏర్పాటు, స్టోర్ రూం, టాయిలెట్స్, రోడ్డు నిర్మాణం, కాంపౌండ్ వాల్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పొందుపర్చారు. చిత్తారమ్మ ఆలయం వెనకాల రాచకొండ స్మశానవాటికలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి …
Read More »సామాన్యులకు షాక్: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ రేటు
సామాన్యులకు బ్యాడ్ న్యూస్. మరోసారి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరింది. నిత్యం ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచాయి చమురు సంస్థలు. దీంతో హైదరాబాద్‌లో గ్యాస్ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ఈ రోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి
Read More »తడి చెత్తతో రూ.6లక్షల ఆదాయం: కేటీఆర్ అభినందన
పంచాయతీలో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రూ.6లక్షల ఆదాయాన్ని సంపాదించిన ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామ సర్పంచ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ముఖ్రాకే ఆదర్శంగా …
Read More »జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు: కేసీఆర్ ఆదేశం
రాష్ట్రంలోని భూముల సమస్య పరిష్కారానికి జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి మూడురోజులకు ఒక మండల కేంద్రం చొప్పున 100 టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సదస్సుల్లో జేసీ, డీఆర్వో, ఆర్డీవో, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనాలని ఆదేశించారు. మరోవైపు ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన అవగాహన సదస్సును ఈనెల 11న నిర్వహించనున్నారు. …
Read More »