కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సభలో వాడకూడని కొన్ని పదాలంటూ ఇటీవల లోక్‌సభ సెక్రటేరియట్ నిషేధించింది. ఈ నేపథ్యంలో మీరు వాడే భాష ఇదా? అంటూ కొన్ని కామెంట్లను పేర్కొంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘ప్రధాని నిరసనకారులను ‘ఆందోలన్ జీవి’ అని పిలవడం మంచిదా? యూపీ సీఎం చేసిన …
Read More »ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం
ములుగుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో వచ్చి వరదల్లో పలు గ్రామాలు ముంపులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంపు గ్రామాల పర్యటనకు సీతక్క వెళ్లారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి వద్ద వాగు ఉండటంతో పడవలో ఆమె అవతలి ఒడ్డుకు బయల్దేరారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న పడవ ఆగిపోయి ఓ చెట్టుకు ఢీకొట్టింది. వాగు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ …
Read More »ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు. వరదల కారణంగా సుమారు 11 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగిందని.. ముంపు ప్రాంతాల్లో ప్రజలను, అన్నదాతలను ఆదుకునేలా రాష్ట్రానికి సాయం చేయాలని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .
Read More »IIIT విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి హరీశ్‌రావు
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును స్పందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, కలెక్టర్, జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య బృందాలను పంపడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
Read More »IIIT విద్యార్థులకు అస్వస్థత.. విచారణకు మంత్రి ఆదేశం
బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ దవాఖానకు తరలించాలని ఆర్జీయూకేటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు
Read More »70 అడుగులకు పైగా గోదావరి ప్రవాహం
కుండపోత వర్షాలు, భారీ వరదల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం 70 అడుగులు దాటి పోయింది. నదీ ప్రవాహాన్ని చూసి స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. భద్రాచలం పరిసరాల్లో ఎటు చూసినా వరద ప్రవాహామే కనిపిస్తోంది. దీంతో భద్రాచలం రామాలయంతో పాటు సమీప కాలనీలు నీట మునిగాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద …
Read More »గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ రేపు ఆదివారం ఏరియల్ సర్వే
తెలంగాణ రాష్ట్రంలో గత వారంతం భారీ వర్షాలు కురిసిన సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ రేపు ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఎన్నడు లేని విధంగా కురిసిన వర్షాలతో కడెం నుంచి భద్రాచలం వరకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. ముంపు …
Read More »ఎగ్‌ఫ్రైడ్ కలుషితం.. ట్రిపుల్ ఐటీలో 600 మందికి అస్వస్థత!
బాసర ట్రిపుల్ ఐటీలో భోజనం వికటించి సుమారు 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలతో పలువురు విద్యార్థులు సృహతప్పి పడిపోయారు. మధ్యాహ్న భోజనంలో వడ్డించిన ఎగ్‌ఫ్రైడ్ రైస్ కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. పీయూసీ-1, పీయూసీ-2 మెస్‌లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు మెస్‌లకు ఒకే చోట భోజనం తయారు చేస్తుంటారు. అప్రమత్తమైన అధికారులు …
Read More »అక్కడ గెలవలేనోళ్లు సిరిసిల్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? కేటీఆర్
టీఆర్‌ఎస్‌లో కొన్ని చోట్ల గొడవలు ఉండడం టీఆర్‌ఎస్ బలంగా ఉందనడానికి నిదర్శనం అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. బలంగా ఉన్న నేతలను పార్టీ కలుపుకొని పోతుందని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్ ఒక్కటే ఉందని ఈ విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ సర్వేలే స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దొర అంటూ ప్రతిపక్షాలు …
Read More »మెట్రోపిల్లర్‌ను ఢీ కొట్టిన బైకు.. ఇద్దరు ష్పాట్‌డెడ్
బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అతివేగంతో మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన మోహిన్ (23), ఒబేద్(22) హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ ఆలయం ఎదురుగా మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు బైకు ధ్వంసం అయింది. పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలాన్ని …
Read More »