ఇకపై థియేటర్‌లో విడుదలయ్యే భారీ సినిమాలు అంత త్వరగా ఓటీటీలోకి రావు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. థియేటర్‌లో విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాలు 10 వారాల తర్వాతే ఓటీటీలో వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పరిమిత బడ్జెట్‌తో రిలీజ్ అయిన సినిమాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇచ్చేలా నిర్ణయించారు. మరోవైపు టికెట్ ధరలు కూడా సాధారణ థియేటర్లు, సి క్లాస్‌లో …
Read More »కేసీఆర్ నిప్పు.. ఆయన్ను ఎవరూ టచ్ చేయలేరు: జగదీష్‌రెడ్డి
కేసీఆర్ సీఎం అయ్యాకే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో దేశం తలసరి ఆదాయం తగ్గిపోయిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బాధ్యతా రాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. వార్తల్లో ట్రెండింగ్ అయ్యేందుకు ప్రతిపక్ష నేతలు పోటీపడుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు …
Read More »బీజేపీలో ఈటలది బానిస బతుకు: బాల్క సుమన్
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. తిన్నింటి వాసాలను ఆయన లెక్కబెడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానంద్‌తో కలిసి సుమన్ మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌విశ్వాసఘాతకుడని తీవ్రస్థాయిలో ఆయన ఆరోపించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డాడని.. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని చెప్పారు. …
Read More »నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 544.50 అడుగుల నీరుండగా.. పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు. సాగర్ డ్యామ్ గరిష్ఠస్థాయి 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Read More »నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,రాష్ట్ర సీఎం కేసీఆర్ నేడు సోమవారం సాయంత్రం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్లే అవకాశమున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజులు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులను కలిసే అవకాశం ఉంది.
Read More »మరో మూడు రోజులు తెలంగాణకు భారీ వర్షసూచన
రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగానూ 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీ సహా 19 రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. గుజరాత్‌లో అతిభారీ వర్షాలు కురిసే …
Read More »డాక్టర్లు 3 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు: కేటీఆర్
మంత్రి కేటీఆర్ స్వల్ప గాయమైంది. ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా తెలిపారు. మూడు వారాల పాటు రెస్ట్ అవవసరమని వైద్యులు సూచించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఇవాళ ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి’’ అని …
Read More »కేటీఆర్‌కు ఏపీ దివ్యాంగ బాలిక అరుదైన గిఫ్ట్
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగ డ్రాయింగ్ ఆర్టిస్ట్ స్వప్నిక్ అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. చిన్నతనంలో విద్యుత్‌షాక్‌తో రెండు చేతులూ కోల్పోయిన స్వప్నిక.. నోటితోనే పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నారు. సందర్భాన్ని బట్టి పొలిటికల్ లీడర్స్, సినీ హీరోల డ్రాయింగ్‌ను ఆమె వేస్తూ ఉంటుంది. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటాన్ని స్వప్నిక గీసింది. కేటీఆర్ చేసే సేవా కార్యక్రమాలు.. ముఖ్యంగా పంజాబ్‌కు …
Read More »డాక్టర్ అవతారమెత్తిన గవర్నర్ తమిళ సై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళపై ఓ వ్యక్తికి చికిత్స అందించారు. నిన్న శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ-హైదరాబాద్ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఛాతిలో నొప్పితో పాటు ఇతర సమస్యలు వచ్చాయి. దీంతో విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే సాయం చేయాలని ఫ్లైట్ సిబ్బంది అనౌన్స్ చేశారు.. అదే విమానంలో ప్రయాణిస్తున్న గవర్నర్ అతడికి ప్రాథమిక చికిత్స అందించి ధైర్యం చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు ఎంబీబీఎస్, ఎండీ-డీజీఓ ను తమిళపై …
Read More »రానున్న 3, 4 రోజులు జాగ్రత్త- సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. మరో 3, 4 రోజుల పాటు వర్గాలు ఉన్నందున ఎగువ నుంచి గోదావరి నదిలోకి వరద వచ్చే అవకాశం ఉండటంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. గోదావరి నది పరీవాహక ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అలెర్ట్ గా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
Read More »