తెలంగాణ రాష్ట్రంలో సర్కారు కొలువులకై ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. తాజాగా టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర రవాణాశాఖలో 113 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్-1లో ఉండగా, 59 పోస్టులు మల్టీ జోన్-2 పరిధిలో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు నెల …
Read More »అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించిన మంత్రులు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరాలకు, పట్టణాలకు దగ్గర్లో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్‌లుగా అర్భన్ ఫారెస్ట్ పార్క్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. …
Read More »మూసీ వరద.. మంత్రి కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలికి గాయమైన కారణంగా ప్రగతి భవన్ నుంచే ఆయన సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులతో ఆయన రివ్యూ చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని.. …
Read More »హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఉస్మాన్‌సాగర్ (Osman Sagar) జలాశయంలోకి 8 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 13 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 8,281 క్యూసెక్కులు మూసీలోకి విడుదల చేశారు. ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 1,789.10 అడుగుల నీటిమట్టం ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు.ఇక హిమాయత్‌సాగర్‌కు 10 వేల …
Read More »రైతులతో పాటు విద్యార్థులకు ‘సహకారం’ – మంత్రి నిరంజన్ రెడ్డి
దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం రైతులతో పాటు డీసీసీబీ విద్యార్థులకు కూడా రుణాలు అందజేస్తుందని వ్యవసాయ,సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో డీసీసీబీ ద్వారా విదేశీ విద్య కోసం రుణం అందుకున్న తొలి విద్యార్థి కరకాల హేమంత్ రెడ్డిని సన్మానించి రూ.23 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్ష కాకూడన్నదే సీఎం కేసీఆర్ …
Read More »TRS ఎంపీలపై సస్సెన్షన్ వేటు సిగ్గుచేటు-మంత్రి కేటీఆర్
పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ,ధరల పెరుగుదలపై నిరసనలు వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీల పై రాజ్యసభ నుంచి సస్సెన్షన్ వేటు సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాల మీద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు …
Read More »చెట్టుకిందే మంత్రి ఎర్రబెల్లి… ప్రజలతో మాటా మంతీ!
నిత్యం జనంలోనే, జనంతోనే ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తన స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడరు. ఎక్కడ? ఎలా? అయినా సరే, జనంతో ఉండటమే ముఖ్యమనుకుంటారు. అలా… అనేక సందర్భాల్లో ప్రవర్తించిన మంత్రి మరోసారి తన రూటే సెపరేటని నిరూపించారు. తాజాగా, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలామ్ విగ్రహావిష్కరణకు వెళుతూ జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్ మండలం కుందారం (పటేల్ గూడెం) …
Read More »ఆగస్టు 1 నుండి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం..
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఓటరు కార్డుకు ఆధారం అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని సీఈఓ కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి .. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా …
Read More »హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వద్ద MMTS ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలోని మూల మలుపు వద్ద ఎంఎంటీఎస్ రైలును గమనించకుండా ముగ్గురు వ్యక్తులు పట్టాలు దాటేందుకు యత్నించారు. ఈ క్రమంలో రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Read More »మరో మూడు రోజులు భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకి వద్దు!
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళవారం అతిభారీ, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది. మరోవైపు సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు పలు కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. ఆ నీరు …
Read More »