మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీవ్ రావు అన్నారు. డెంగీ నివారణలో భాగంగా.. మంత్రి తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్రపరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు.మొక్కల తొట్లను క్లీన్ చేశారు. ప్రజలంతా ఇంట్లో నీళ్లు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. …
Read More »కేంద్రమంత్రి సింధియాకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్!
కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణకు వచ్చి రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ కంటే సింధియా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో మెరుగైన అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జనాభా. దేశానికి …
Read More »మంత్రి సత్యవతి రాథోడ్‌ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారి తల్లి గారు మృతిచెందిన సంగతి విధితమే. ఈ క్రమంలో మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి …
Read More »జయశంకర్ వర్సిటీలో ర్యాగింగ్.. 20 మందిపై కఠిన చర్యలు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఫస్టియర్ స్టూడెంట్స్‌ను సుమారు 20 మంది సీనియర్ల ర్యాగింగ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం క్రితం జూనియర్ల హాస్టల్‌లోకి వెళ్లి వారి డ్రెస్సులు విప్పించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు. మద్యం తాగాలని ఒత్తిడి చేయడం, సీనియర్ల హోంవర్క్ చేయిండం లాంటివి చేశారు. దీంతో ఓ విద్యార్థి ఈనెల 25న ఢిల్లీలోని యాంటీ …
Read More »‘అక్కడ జరగని పాపం లేదు.. అన్యాయాలను ఊహించలేము’
ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అశ్వినీదత్. సీతారామం సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ గవర్నమెంట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరగని పాపం లేదని.. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని అశ్వినీదత్ విమర్శంచారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆమధ్య …
Read More »మల్కాజిగిరిలో వ్యభిచారం -సడెన్ గా పోలీసులు ఎంట్రీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి శారదానగర్ కాలనీ ఫేజ్-3లో వరదవాణి(60) నివాసముంటోంది. ఓ మహిళ (36) వరదవాణికి పరిచయం అయ్యింది. తాను వ్యభిచారం చేస్తానని, వచ్చిన డబ్బులో సగం ఇస్తానని ఒప్పందం చేసుకుంది. గురువారం రాత్రి వరదవాణి ఇంట్లో ఆమె వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. మహిళతో పాటు భగవాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1500 నగదును, 3 …
Read More »హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ అంక్షలు
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో ఈ రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రవీంద్రభారతి వరకు, కార్యక్రమం ముగిసిన తర్వాత రవీంద్రభారతి నుంచి జూబ్లీహిల్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు.సాయంత్రం 5.30 …
Read More »ఆ స్టిక్కర్ ఎవరో పెట్టుకుంటే నాకేం సంబంధం?: మంత్రి మల్లారెడ్డి
క్యాసినో కేసులో నిర్వాహకులు మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. అయితే ఈడీ తనిఖీల సమయంలో మాధవరెడ్డి కారుకు మేడ్చల్ ఎమ్యెల్యే, మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉన్న అంశం చర్చనీయాంశమైంది. బోడుప్పల్‌లో ఓ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అంశంపై స్పందించారు. అది మార్చి 2022 నాటి స్టిక్కర్ అని.. దాన్ని మూడునెలల క్రితమే …
Read More »హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మదాపూర్, షేక్‌పేట, టోలిచౌకి, రాయదుర్గం, గండిపేట, రాజేంద్రనగర్, కిస్మత్‌పర్, బండ్లగూడ జాగీర్ ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. అత్తాపూర్, శివరాంపల్లి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కూకట్‌పల్లి, ఎల్లమ్మబండ, గోల్కొండతో పాటు తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుండగా.. వాహనాలు ఇబ్బందులకు గురయ్యారు. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్, గాజులరామారం, సుచిత్ర, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, కొంపల్లి భారీ …
Read More »కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బహిష్కరణకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో మరింత నష్టం జరగకముందే ఆయనపై వేటు వేస్తే పార్టీ శ్రేణులకు బలమైన సంకేతాలు పంపినట్టుగా ఉంటుందని యోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో మునుగోడులో పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని కాదని కోమటిరెడ్డికి …
Read More »