ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే.. రైతు, ప్రజావ్యతిరేక విధానాలే ప్రధాని మోదీకి శత్రువు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో కేంద్రంలోని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు. వ్యవసాయ కరెంటు మోటార్లకు కేంద్రం ఎందుకు మీటర్లు పెట్టమంటున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. కారణాలు ఏంటో చెప్పాలని నిలదీశారు. ‘ఎదుకు పెట్టమంటున్నవ్ మీటర్.. ఏం కారణం.. నిన్ను మేం అడుగుతలేమే.. నిన్ను బతిమిలాడినమా పైసలు …
Read More »మొక్కలు నాటిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
వజ్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆదివారం తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇవాళ ఒక్కరోజే 75 లక్షల మొక్కలు నాటుతున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్‌లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.గతంలో …
Read More »కాళేశ్వరం పంప్ హౌజ్ లు మునగడం ప్రకృతి వైపరిత్యమా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రాణహిత, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా నిర్మించిన ఈ ప్రాజెక్టులో లక్ష్మి పంప్ హౌజ్, సరస్వతి పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్ కీలకమైనవి. అయితే ఎన్నో ఏండ్ల తర్వాత కురిసిన అతి భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులో పంప్ హౌజ్ …
Read More »ప్రగతి భవన్ నుంచి మునుగోడు వరకు.. కేసీఆర్ భారీ ర్యాలీ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ మునుగోడులో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగానే టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడులో ‘ప్రజాదీవెన’ బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు భారీ ర్యాలీతో సీఎం వెళ్లేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ప్రగతిభవన్ నుంచి ప్రారంభమైన …
Read More »రేపు మునుగోడుకు అమిత్ షా
తెలంగాణలో నల్లగొండ జిల్లా మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు రేపు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా బహిరంగ సభకు బయలుదేరనున్నారు. అనంతరం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీని సందర్శించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అమిత్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More »మునుగోడుకు సీఎం కేసీఆర్
త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడులో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమయింది. సభా ప్రాంగణంతోపాటు మునుగోడు అంతా గులాబీమయం అయింది. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు. సభావేదికగా గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికకు సమరశంఖం పూరించనున్నారు.ప్రజాదీవెన సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు …
Read More »మునుగోడులో TRS కు శుభసంకేతం
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి శుభసంకేతం ఇది. టీపీసీసీ అధ్యక్షుడు… మల్కాజీగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై ఆది నుండి తీవ్ర వ్యతిరేకత ఉండటమే కాకుండా కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన బంపర్ ఆఫర్ కు లోంగి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కోమటిరెడ్డి …
Read More »ఒక్కడికే 2 ప్రభుత్వ ఉద్యోగాలు.. రిటైర్‌మెంట్‌లో షాక్!
ఓ వ్యక్తి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేశాడు. అంతే కాకండా ఆ రెండు చోట్లా రిటైర్ అయ్యాడు కూడా. కనీసం పక్కనున్న వ్యక్తికి తెలీకుండా, ఎవరకీ అనుమానం రాకుండా ఇన్నేళ్లు పని చేసిన వ్యక్తి తాజాగా పెన్షన్ కోసం వెళ్లి దొరికిపోయాడు. హనుమకొండ జిల్లా కిషన్‌పురాకు చెందిన ఎస్‌కే సర్వర్ రెండు వేరువేరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకొని.. ఒకదాన్ని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో, మరొకటి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో …
Read More »బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్‌లకే తెలియాలని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. రాష్ట్ర నాయకత్వం తనను సైలెంట్‌లో ఉంచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలమని.. బాధ్యతలు ఇవ్వకుండా ఏం చేయగలమని విజయశాంతి ప్రశ్నించారు. తనదెప్పుడూ రాములమ్మ పాత్రేనని.. ఉద్యమకారిణిగా అందరి …
Read More »‘3 నెలలకు ఒకసారి ప్రమోషన్.. ఇన్ టైంలో జీతం’..!
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును నిలిపే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. గత త్రైమాసికంలో సంస్థ లాభాలు తగ్గడం వల్ల ఉద్యోగుల వేరియబుల్ పే ను కంపెనీ నిలిపివేస్తున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లకొట్టాయి. దీనికి స్పందించిన సంస్థ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో వెనకడుగు వేయడం లేదని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రమోషన్ల …
Read More »