Home / TELANGANA (page 166)

TELANGANA

జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp

కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని వసంత నగర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మెట్రోకేర్” హాస్పిటల్ ను ఈరోజు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు గారు మరియు కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

మునుగోడు ఉప ఎన్నికలు-సీపీఎం సంచలన నిర్ణయం

  తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న  మునుగోడు  అసెంబ్లీ నియోజకవర్గ  ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని అధికార పార్టీ అయిన  టీఆర్‌ఎస్   పార్టీకి సీపీఎం   మద్దతు ప్రకటించింది. ఈ రోజు గురువారం ఉదయం  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు  లో తమకే సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలు కోరాయని తెలిపారు. అయితే బీజేపీ  ని ఓడగొట్టడానికి టీఆర్ఎస్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామన్నారు. అభివృద్ది …

Read More »

రామ లింగేశ్వర స్వామి ఆలయాన్ని‌ సందర్శించిన మంత్రి హరీష్ రావు

 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలోని నందికంది‌ గ్రామంలో గల రామ లింగేశ్వర స్వామి ఆలయాన్ని‌   సందర్శించి పూజలు‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..11 శతాబ్దం నాటి దేవాలయం నంది కొండలో ఉండటం గొప్ప విషయం. ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరిక మేరకు 25 లక్షల రూపాయలు తక్షణం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  …

Read More »

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతి

దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణనాథుడి వద్ద సందడి షురూ అయ్యింది. ఈ భారీ పంచముఖ మహాలక్ష్మీ విగ్నేశ్వరుడుకి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తొలిపూజ చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 50 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. జూన్ 10 నుంచి 150 మంది కళాకారులు 80 రోజులు …

Read More »

తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. అందుబాటులో స్పెషల్ ట్రైన్

తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితి కానుకగా ఆగష్టు 31, సెప్టెంబరు 1(రేపు, ఎల్లుండి) రెండు ప్రత్యేక రైళ్లను తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. ఈ స్పషల్ ట్రైన్లు సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మధ్య తిరగనున్నాయని రైల్యే శాఖ పేర్కొంది. టైమింగ్స్ ఇవే.. స్పెషల్ ట్రైన్ నెం. 07120 రేపు ఆగష్టు 31న సాయంత్రం 6.15కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి …

Read More »

విజయ డైరీ రైతులకు శుభవార్త

విజయ డైరీ రైతులకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయకచవితికి ముందే శుభవార్త చెప్పారు. విజయ డెయిరీ ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు సోమవారం రాజేంద్ర నగర్ లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించే క్రమంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు, పాడి …

Read More »

తెలంగాణ పై బీజేపీ సరికొత్త కుట్ర

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో పచ్చగా ఉన్న బంగారు తెలంగాణలో మత గొడవలు సృష్టించడానికి  బీజేపీ పార్టీ సరికొత్త కుట్రలకు తెరతీసిందని రాష్ట్ర  హోం శాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ ఆరోపించారు. గత ఎనిమిదేండ్లుగా ఎంతో శాంతియుతంగా ఉన్న తెలంగాణను ఆగం చేసేందుకే గల్లీ నుండి ఢిల్లీ  వరకు బీజేపీ నేతలు కంకణం కట్టుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు  పన్నుతున్న …

Read More »

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు .. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. నిన్న సోమవారం పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ను వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరిగితే నేను పాదయాత్రను విరమిస్తాను అని అన్నారు. సెప్టెంబర్ నెల పన్నెండో తారీఖు నుండి నేను …

Read More »

గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే: కేసీఆర్‌

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించి రైతు ప్రభుత్వాన్ని తీసుకొస్తారని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇటీవల 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని చెప్పారు. పెద్దపల్లిలో జిల్లా కలెకర్ట్‌ కార్యాలయం, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని ప్రజల్ని ఆయన …

Read More »

బీజేపీ నాయకుల మాటలు విని ఆగమవొద్దు: మంత్రి ఎర్రబెల్లి

బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వరంగల్‌ జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరులో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat