వినాయక నిమజ్జనానికి తరలివచ్చేవారి కోసం నేడు మెట్రో ట్రైన్ సేవలను పొడిగించినట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి ఒంటి గంట వరకు ట్రైన్లు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. ఎల్‌బీనగర్, నాగోల్, రాయదుర్గం, మియాపూర్, జేబీఎన్, ఎంజీబీఎన్ స్టేషన్లలో చివరి ట్రైన్ ఒంటి గంటకు ప్రారంభం అవుతుంది. అంటే చివరి స్టేషన్లకు 2 గంటలకు చేరుకుంటాయి. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చూడాలి అనుకుంటే ప్రయాణికులు సమీప స్టేషన్లు …
Read More »మరోసారి బాలాపూర్ లడ్డూకి రికార్డు స్థాయి ధర
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలపాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.5 లక్షల 70 వేలు అధికం కావడం విశేషం. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం …
Read More »అభివృద్ది ,సంక్షేమం టీఆరెఎస్ తోనే సాధ్యం-MLA డా.సంజయ్
రాయికల్ మండల కో ఆప్షన్ సభ్యులు ముఖీద్ గారి అధ్వర్యంలో అల్లిపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఏర్రవెని ఆశాలు మరియు వారి అనుచరులు 30 మందికి పైగా అనుచరులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి టీఆరెఎస్ పార్టీ లో చేరగా టీఆరెఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.ఎమ్మేల్యే మాట్లాడుతూ భారత దేశం లో బీజేపీ,కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల కన్నా …
Read More »ఉజ్వల భారత్ కోసం ఉద్యమ వీరుడు
తెలంగాణ భూమి పుత్రుడు, రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి ప్రదాయకుడు, నాలుగు కోట్ల ప్రజల ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నరు. కేసీఆర్ నేతృత్వంలో, పోరుగడ్డ తెలంగాణ వేదికగా నూతన జాతీయ రాజకీయ పార్టీ అవతరించబోతున్నది. టీఆర్‌ఎస్‌లోని అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అవి తెలియజేసిన సమాచారం ప్రకారం అధికారమే అంతిమంగా చేసే తంత్రాలకు, పదవులే లక్ష్యంగా సాగే పంథాలకు భిన్నంగా, …
Read More »మరికాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రస్తుతం మహా గణపతిని భారీ క్రేన్ సహాయంతో ట్రాలీ పైకి ఎక్కిస్తున్నారు. అనంతరం వెల్డింగ్ పూర్తిచేసి.. నిమజ్జన శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని చివరి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే …
Read More »నిమజ్జనానికి తీసుకెళ్తుండగా కూలిన గణనాథుడి విగ్రహం..!
సిటీలో నేడు వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షం కురుస్తుండడంతో ఉదయం నుంచే నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో హిమాయత్‌నగర్‌లో ఓ మండపం నుంచి వినాయకున్ని తీసుకెళ్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. వర్షానికి తడిసిన 20 అడుగుల గణనాథుడి మట్టి విగ్రహం నిమజ్జనానికి తీసుకెళ్తుండగా కుప్పకూలింది. కర్మన్‌ఘాట్‌లోని టీకేఆర్ కాలేజ్ వద్ద నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి తీసుకెళ్తుండగా హిమాయత్ …
Read More »నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షం పడుతుందని చెప్పింది వాతావరణశాఖ. సిటీలోనూ ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా …
Read More »హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్
గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు మూత పడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసుశాఖ స్పష్టం చేసింది. కల్లు దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశించింది. వినాయక నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే …
Read More »కొంపల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఉమామహేశ్వర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి గౌరవ సీఎం కేసీఆర్ గారు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు …
Read More »తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు
తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే .. ఆపార్టీ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని మధ్య పోటీ నెలకొనగా చివరకు కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. ఈయన అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014, 18లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో …
Read More »