డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ( డిప్యూటీ సివిల్ సర్జన్ ) ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు (డి హెచ్ విభాగం) గారి పుట్టినరోజు వేడుకలు నిలోపర్ వైద్యశాలలో ఘనంగా జరిగాయి.ఈ సదర్భంగా డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ గారు మాట్లాడుతూ మీ అందరి ప్రేమాభిమానాలు నా మీద ఇంకా ఎక్కువ బాధ్యతను పెంచాయి. అనేక మంది కి సేవ సేవ అదృష్టం దేవుడు నాకు మనకు కల్పించారు.మనందరం కలిసి …
Read More »తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి KCR గారి పూర్తి ప్రసంగం
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం…యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను …
Read More »సిద్దిపేటలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు
తెలంగాణలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ …
Read More »నేడు తెలంగాణలో సెలవు
తెలంగాణ రాష్ట్రంలో నేడు సెలవు దినంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. నేడు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు త్రివర్ణ జెండాను ఎగురవేయనున్నారు.
Read More »వెంకన్నను సన్నిధిలో ముకేశ్ అంబానీ.. శ్రీవారికి భారీ విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకం, నిజపాద దర్శసేవలో పాల్గొన్నారు. అనంతం వడ్డీకాసుల స్వామికి రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. తర్వాత తిరుమల గోశాలను దర్శించారు. ముకేశ్‌తో పాటు ఆయన రెండో కొడుకు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీలు …
Read More »విజయవాడకు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏపీలోని విజయవాడకు వెళ్లనున్నారు. వచ్చే నెల అక్టోబర్ 14 నుంచి 18 వరకు జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సభలకు కేరళ, బిహార్ సీఎంలు పినరయి విజయన్, నితీష్ కుమార్ తో పాటు 20 దేశాల నుండి కమ్యూనిస్ట్ నేతలు హాజరుకానున్నారు. అయితే మూడేళ్ల తర్వాత సీఎం కేసీఆర్, ఏపీకి వెళ్లనున్నారు. …
Read More »ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్సిజన్ పార్కు ప్రారంభం
పచ్చని వాతావరణంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిసరాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ సహకారంతో ఉస్మానియాలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ పార్క్ ను ఓయూ ఉపకులపతి ఆచార్య డి. రవిందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్, ఓఎస్డీతో కలిసి ఆక్సీజన్ పార్క్ …
Read More »నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
రాష్ట్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి రేపటికి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా ప్రారంభించింది ప్రభుత్వం. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా రేపు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టనున్నారు. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. మినిస్టర్లు, …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే నీలి విప్లవం
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పాలనలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని .. మత్స్యకారుల ప్రతి ఇంటా నేడు సంతోషాలు నెలకొన్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఈ రోజు శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నాగపూర్ పాయింట్ వద్ద 62.86 లక్షల ఉచిత చేప పిల్లలను మంత్రి ప్రశాంత్ రెడ్డి వదిలారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. చేప పిల్లలు …
Read More »ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ సెటైర్
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడం పట్ల ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చినట్లు ఆయన ఆరోపించారు. ఇప్పటికే అక్కడ ఉన్న సర్దార్ పటేల్ స్టేడియంను నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చినట్లు మంత్రి కేటీఆర్ …
Read More »