Home / TELANGANA (page 145)

TELANGANA

తెలంగాణలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18 నుంచి 19 ఏండ్ల వయస్సు) ఓటర్లు ఉన్నారని వివరించింది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో 3,03,56,894 మంది ఓటర్లున్నారు.. అయితే ఓటర్ల పరిశీలన తర్వాత 3,45,648 మంది ఓటర్లకు …

Read More »

కుల వృత్తులకు ఊతమిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం..

కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం ఊతమిస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఉర్సు చెరువులో తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేప పిల్లలను వదిలారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేస్తుందన్నారు.. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించి చెరువులపై ఆదారపడ్డ కుల వృత్తులకు ప్రభుత్వం ఊతమిచ్చిందన్నారు..అన్ని కులాలు ఆర్థిక పరిపుష్టి సాదించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్బుత కార్యక్రమాలను …

Read More »

దస్తురబాద్ మండలంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ సుడిగాలి పర్యటన….

దస్తురబాద్ మండలంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.ఈ సందర్భంగా దేవునిగుడెం లో 20 లక్షల రూపాయలతో నిర్మించే గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజ చేశారు.అనంతరం ఆకొండపెట్ లో చెరువు మత్తడి మరమ్మత్తు పనులను ప్రారంభించి మున్యల్ లో మనా ఊరు మన బడి పథకం ద్వారా మంజూరైన ప్రభుత్వ పాటశాల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ …

Read More »

ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా …

Read More »

సంక్రాంతికి కొత్త సచివాలయం..!

రాష్ర్టంలో కొత్త సచివాలయం బిల్డింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రానున్న సంక్రాంతికి కొత్త సచివాలయాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కీలకమైన భారీ డోమ్‌ల నిర్మాణం, బిల్డింగ్ లోపల ఫినిషింగ్ పనులు, చుట్టూ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, పచ్చికబయళ్ల పనులు మాత్రమే చేయాల్సి ఉంది. రాజస్థాన్ ధోల్పూర్ నుంచి తెప్పించిన ఎర్ర రాయితో కొత్త సచివాలయం బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం దీనిలో …

Read More »

మంత్రి గంగుల, గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లల్లో ఈడీ, ఐటీ సోదాలు..!

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఈడీ, ఐటీ సంయుక్త సోదాలను నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో పలు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లల్లో, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్‌ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు రావడంతో 20కి పైగా బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ మంత్రి ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. ఆదాయపన్ను(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెర్టరేట్(ఈడీ) ఏకకాలంలోనే ఈ సోదాలు జరుపుతున్నారు. కరీంనగర్‌లోని మంత్రి గంగుల …

Read More »

ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే Kp సమీక్ష

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్-కొంపల్లి మున్సిపాలిటీలలో సుమారు రూ.205 కోట్లతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ, మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి, ఎస్.ఎన్.డి.పి, అర్బన్ ఫారెస్ట్, టీఎస్పిడిసీఎల్, కన్స్ట్రక్షన్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా

చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్‌గూడకు చెందిన హారికకు అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత తక్షణమే స్పందించారు. నిజామాబాద్‌ పర్యటన సందర్భంగా హారికను కలిసిన ఆమె ఎంబీబీఎస్ కోర్సును పూర్తి …

Read More »

ఏపీలో పట్టాలు తప్పిన ట్రైన్.. 9 రైళ్లు రద్దు..!

ఏపీలోని రాజమండ్రి స్టేషన్‌ సమీపంలో బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు గూడ్స్ ట్రైన్‌ పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌కు రాజమండ్రి బాలాజీపేట వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో పలు ట్రైన్లు రద్దు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడం వల్ల ఒకే ట్రాక్‌పై ఇతర రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. …

Read More »

భవిష్యత్‌లోనూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్తాం: జగదీష్‌రెడ్డి

కమ్యూనిస్టు పార్టీల ప్రచారం వల్లే మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్‌కు కూసుకుంట్ల, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోకలిసి జగదీష్‌రెడ్డి వెళ్లారు. టీఆర్‌ఎస్‌విజయానికి సీపీఐ, సీపీఎం శ్రేణులు కష్టపడ్డాయంటూ ఆ పార్టీ నేతలకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat