KTR: మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ గురించి ఐటీసీ ఛైర్మన్ మాట్లాడిన మాటలు…సంతోషం కలిగించాయన్నారు. ఐటీసీ అతిపెద్ద పేపర్ మిల్లు తెలంగాణలోనే ఉందన్నారు. అతి తక్కువ సమయంలోనే తెలంగాణ ప్రగతి సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మిగులు విద్యుత్ ను సాధించడమే కాక….. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగామన్నారు. 68 లక్షల టన్నుల నుంచి నేడు మూడున్నర …
Read More »GANDHI VARDANTHI: శాసనసభ ప్రాంగణంలో జాతిపితకు నివాళులు
GANDHI VARDANTHI: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో జాతిపితకు నివాళులర్పించారు. శాసనసభ సభాపతి, మండలి ఛైర్మన్ మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. శాంతి, అసింహతోనే మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చారని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ చాటిచెప్పిన పద్ధతుల్లోనే అందరూ నడవాలని హితవు పలికారు. గాంధీ కలలుగన్న స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలు …
Read More »స్మితా సబర్వాల్ ఇంటిలోకి చొరబాటు కేసులో ట్విస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రముఖ ఐఏఎస్ అధికారిణి అయిన స్మితా సబర్వాల్ ఇంటిలోకి డిప్యూటీ ఎమ్మార్వో చొరబడిన సంఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు మ్యాటర్ మాట్లాడేందుకే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ క్వార్టర్ కు వెళ్లినట్లు మాజీ డిప్యూటీ తహసీల్దార్ ఆనందర్ కుమార్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆనందకుమారెడ్డితో పాటు మరో 9 మంది అధికారుల పదోన్నతుల కోసం …
Read More »ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ
ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్.. కవితను అడిగి తెలుసుకున్నారు.
Read More »ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి కన్నుమూత
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి కన్నుమూశారు. 32 ఏండ్ల స్వామి.. ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడ్డారు. ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించారు. కాగా, శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి స్వామి కిందపడిపోయారు. దీంతో మెడకు గాయమవడంతో స్థానికంగానే చికిత్స చేయించుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో …
Read More »సుభాష్ నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ ఆలయ కమిటీ సౌజన్యం సుమారు రూ.85 లక్షలతో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కమిటీ హాల్ స్థలాన్ని ఏళ్లుగా …
Read More »బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి శివరాజ్ పాంగి, ఇతర నాయకులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గిరిధర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు శిశిర్ …
Read More »పెను విషాదం.. అందరూ చూస్తుండగానే ప్రేమికులు
రైలు బయలుదేరిన కాసేపటికి ఓ ప్రేమ జంట అందులో నుంచి దూకేసింది. ఈ హఠాత్పరిణామానికి రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన చెన్నై బీచ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకోగా.. ప్రేమికుల్లో యువతి అక్కడికక్కడే కన్నుమూసింది. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిని గమనించిన కో పైలట్ రైలును తక్షణమే ఆపేశాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న మాంబళం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు …
Read More »జమ్మికుంటలో కలకలం
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో ఓ హృదయ విధాకర ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలు ఇంజిన్ కి ఓ మృతదేహం చిక్కుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జమ్ము వెళ్తున్న అండమాన్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ కి ఓ మృతదేహం చిక్కుకుని కనిపించింది. రైలు జమ్మికుంట స్టేషన్ కి రాగానే రైలు నడుపుతున్న లోకో పైలట్ మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే రైలును ఆపేశాడు. మృతదేహాన్ని రైలు ఇంజిన్ నుంచి విడదీశారు.మృతుడు …
Read More »రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అజనీ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More »