ఆస్తితగాదాలతో తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురైన ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం కొండూరుకు చెందిన యాకుబ్ దంపతులకు ఇద్దరు కుమారులు(పెద్ద కుమారుడు శంషొద్దీన్, చిన్న కుమారుడు ఉమర్). వారికి ఎనమిది ఎకరాల భూమి ఉంది. కొడుకులకు చెరి మూడు ఎకరాల భూమిని పంచి ఇచ్చాడు. రెండు ఎకరాల భూమిని తల్లిదండ్రులు సాగు …
Read More »మంత్రి కేటీఆర్ పనితీరుకు అవార్డులే నిదర్శనం..
తెలంగాణ రాష్ట ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు వస్తున్న అవార్డులే ఆయన పనితీరుకు నిదర్శనమని ప్రభుత్వ విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు అన్నారు. కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అని అన్నారు. కేవలం దుగ్ధ, ఈర్ష్యలతోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ మంత్రిగా ఫెయిల్ అయిన షబ్బీర్ అలీ మంత్రి కేటీఆర్ ను …
Read More »కేబీఆర్ పార్కు చుట్టు ఫ్లైఓవర్ నిర్మాణానికి రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి మోక్షం లభించింది.ఈ నెల దసరా పండుగ తర్వాత ఫ్లై ఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్ నం-45, ఫిల్మ్‌నగర్, అగ్రసేన్ సర్కిల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, తదితర జంక్షన్లలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, గ్రేడ్ సెపరేటర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. …
Read More »కార్మికశాఖలో 248 పోస్టుల భర్తీకి అనుమతి
తెలంగాణ రాష్టం లోని కార్మిక శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 248 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 172 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు, 45 టెక్నికల్ అసిస్టెంట్, 18 డ్రెస్సర్, 10 ఫార్మాసిస్ట్ ఖాళీలు, రెండు లైబ్రేరియన్, ఇన్ఫర్మేషన్ ఆఫ్ బాయిలర్స్ ఒక పోస్టు భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ …
Read More »కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణ సమాజానికి చిరస్మరణీయుడు
తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణ సమాజానికి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు.స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో ముందంజ వేయటమే కొండా లక్ష్మణ్ లాంటి గొప్పవారికి మనం అందించగలిగే నిజమైన నివాళి అన్నారు. తమ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నదని సీఎం తెలిపారు.
Read More »వెలుగులోకి వచ్చిన మరో మహా జలపాతం
తెలంగాణ సోయగాలు వెతికినకొద్దీ కనిపిస్తూనే ఉంటాయి! వేల సంవత్సరాల క్రితపు ఆశ్చర్యకర సంగతులు కొత్తగా పలుకరిస్తూనే ఉంటాయి! భూపాలపల్లి జిల్లాలో మొన్నటిదాకా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని బొగత జలపాతం ఒక రమణీయదృశ్యమైతే.. దానిని తలదన్నే రీతిలో అదే జిల్లాలో మరో కమనీయ దృశ్యంగా నిలుస్తున్నది.. దాదాపు ఏడు వందల అడుగుల ఎత్తునుంచి దుంకుతున్న గద్దలసరి జలపాతం!! దేశంలోనే అతి ఎత్తయిన జలపాతాల సరసన నిలిచే ఈ ప్రకృతి అద్భుతం …
Read More »ఆంధ్రాకు వెళ్లి వారసత్వం తెస్తారా..?ఎంపీ బాల్క సుమన్
ఏఐటీయూసీ చంద్రబాబుతో పొత్తుపెట్టుకొని ఆంధ్రాకు వెళ్లి వారసత్వ ఉద్యోగాలు తెస్తారా అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్‌కే 5గనిపై ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీ బాల్క సుమన్ ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి మాట్లాడారు. తెలంగాణ ద్రోహి టీడీపీతో పొత్తు పెట్టుకొని కార్మికులను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. టీబీజీకేఎస్ గెలుపు ఖాయం… మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మందమర్రి రూరల్: సింగరేణి గుర్తింపు …
Read More »కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకున్న సీఎం కేసీఆర్
మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజానికి చిరస్మరణీయుడని సీఎం కేసీఆర్ అన్నారు. రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయడమే కొండా లక్ష్మణ్ లాంటి గొప్ప వారికి మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. తమ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తుందని సీఎం కేసీఆర్ హామీ …
Read More »ఐశ్వర్యరాయ్ ని మరిపిస్తున్న వరంగల్ అమ్మాయిల డ్యాన్స్..వైరల్ వీడియో
అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీను ఒక ఊపు ఊపిన జీన్స్ మూవీలో కన్నులతో చూసేది గురువా కనులకు స్వంతమౌన అనే పాట అప్పటి కుర్రకారు గుండెలతో పాటుగా పలువురి మదిని గెలుచుకుంది.ఆ పాటలో ఐశ్వర్యాయ్ డాన్స్ అప్పట్లో మతిపోగెట్టేసింది.తాజాగా అదే పాటలో వరంగల్ కు చెందిన కాట్రగడ్డ హిమన్సీ చౌదరి మరియు మరో అమ్మాయి మిథిలా రెడ్డి డాన్స్ కంపోజ్ చేసి అందరి మదిని కొల్లగోట్టుతున్నారు ..ఇప్పుడు ఈ వీడియో …
Read More »రేపటి నుంచి మినుముల కొనుగోలు.. మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో మినుముల కొనుగోలుకు రేపు 14 ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెసర్లు, మినుములు, పత్తి తదితర పంటల దిగుబడి, మార్కెట్ లో ప్రస్తుతమున్న ధర, రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి హరీశ్ రావు పలు సూచనలు చేశారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు మినుములు తీసుకురావాలని హరీశ్ …
Read More »