సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీలతో కల్సి పోటీ చేస్తున్నామని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. 6 నుంచి సీపీఐ చేపట్టబోతున్న పోరుబాట కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను మగ్దూం భవన్‌లో విడుదల చేసిన చాడ ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో ఓటమి భయంతోనే మంత్రులు, ఎంపీలంతా సింగరేణి కాలరీస్ ప్రచారంలో పాల్గొంటున్నారని చాడ ఆరోపించారు.
Read More »సీఎం కేసీఆర్‌పై మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు..!
వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, ఇప్పుడు కారుణ్య నియామకాల పేరుతో సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులను మరోసారి మోసం చేస్తున్నాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. టీఆఎర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ను గెలిపించేందుకు సీఎం కేసీఆర్ మాయమాటలు చెబతున్నారని భట్టి అన్నారు.గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేసినా చట్టబద్ధంగా చేయాలని , కానీ కేసీఆర్ మాత్రం మాయమాటలతో …
Read More »వర్షం ఎఫెక్ట్…నేడు హైదరాబాద్ లో సెలవు
హైదరాబాదును భారీ వర్షం ముంచెత్తింది. నిన్న సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురిసింది. చిన్నగా మొదలైన వాన తీవ్రరూపం దాల్చింది. గాలులుతో కూడిన వర్షం హైదరాబాదుకు విద్యుత్ సరఫరా లేకుండా చేసింది. సుమారు పది నుంచి పదమూడు సెంటీమీటర్లమేర కురిసిన వర్షం ధాటికి హైదరాబాదు స్థంభించింది. కురిసిన వర్షం ధాటికి సుమారు 40 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగర వ్యాప్తంగా రోడ్లపై నీరు చేరింది. నాలాలు …
Read More »టీబీజీకేఎస్‌లో భారీగా చేరికలు…
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గడువు దగ్గరవుతున్న కొద్దీ ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నుంచి వలసలు భారీగా పెరిగాయి. గోదావరిఖనిలో హెచ్‌ఎంఎస్ యూనియన్‌కు చెందిన ముఖ్య నాయకులు షబ్బీర్‌అహ్మద్, అంబటి నరేశ్ ఎంపీ కవిత సమక్షంలో టీబీజీకేఎస్‌లో చేరారు. వీరికి తోడుగా పెద్ద సంఖ్యలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఇతర సంఘాల నుంచి టీబీజీకేఎస్‌లో చేరారు. పెద్దపల్లి జిల్లా ఏపీఏ డివిజన్ పదోగని ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ ఆకుల మల్లయ్యతోపాటు మరో …
Read More »అత్యవసర సహాయం కోసం 100కు ఫోన్ చేయాలి…మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో ఈ రోజు కురిసిన భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించమన్నారు. విద్యుత్‌శాఖ కంట్రోల్‌రూం నెంబర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా వెంటనే చక్కదిద్దేలా పనిచేస్తున్నామని అన్నారు. కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ ద్వారా సహాయక చర్యలు పర్యవేక్షిస్తోందన్నారు. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలు కొంత ఆలస్యం …
Read More »కారుణ్య నియామకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలు… ఎంపీ కవిత
భూపలపల్లి అంబేద్కర్ సెంటర్ దగ్గర టీబీజీకేఎస్ బహిరంగసభ జరిగింది. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు కవిత, వినోద్, పసునూరి దయాకర్, సివిల్‌సైప్లె కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. సభలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవిత మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ 2016లోనే సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇస్తమన్నారు. వారసత్వ ఉద్యోగాలను కార్మిక వ్యతిరేకులు ఆపిన్రు. వారసత్వ ఉద్యోగాలు అంటే కోర్టుల్లో నిలవడం లేదు. కారుణ్య నియామకాల …
Read More »అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..సీఎం కేసిఆర్
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నగరంలో పరిస్థితిపై సోమవారం రాత్రి సీఎం అధికారులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ కమీషనర్, నగర్ పోలీస్ కమిషనర్‌లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. రాత్రంతా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఇబ్బంది వున్నా వెంటనే స్పందించాలని …
Read More »విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే ఈ నెంబర్స్ కి ఫోన్ చేయండి
హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. విద్యుత్ నిలిచి పోయిన ప్రాంతాల ప్రజలు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్స్ 7382072104, 7382071574, 9490619846 నెంబర్లకు ఫోన్ చేయాలని సీఎండీ రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు.
Read More »మరో రెండు రోజులు భారీ వర్షాలు…
హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో భారీ వాన కురుస్తున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వాతావరణంలో ఆకస్మిక మార్పులు వస్తుంటాయన్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలతో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని చెప్పారు.
Read More »హైదరాబాద్‌లో కుండపోత….GHMC హెల్ప్ లైన్
ఉరుములు.. మెరుపులు.. ఏకథాటిగా వాన. హైదరాబాద్‌ను ఇవాళ భారీ వర్షం ముంచెత్తింది. ఒకేతీరుగా దంచికొట్టింది. కుండపోత వానకు నగరం తడిసి ముైద్దెంది. కనీసం రెండు గంటల నుంచి ఒకటే రేంజ్‌లో వర్షం పడుతున్నది. దీంతో కీలక ప్రాంతాలన్నీ జల మయం అయ్యాయి. మెరుపులా కురిసిన వర్షం వల్ల నగరంలో ట్రాఫిక్ భారీగా జామైంది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో హెల్ప్ లైన్ …
Read More »