తెలంగాణ రాష్ట్రంలోనిఎంబీసీ లకు ఇక మంచి రోజులు వచ్చాయన్నారు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. బుధవారం మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే చత్తాధ శ్రీ వైష్ణవ సంఘం వారు నిర్వహించిన చైతన్య సదస్సుకి డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి తో కలిసి సమావేశం లో మాట్లాడారు. బ్యాంక్ లింకేజీ లేకుండా లోన్ ఇస్తామన్నారు తాడూరి. రాష్ట్రంలో ని ప్రధాన దేవాలయాల్లో వేద …
Read More »తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త …!
తెలంగాణ రాష్ట్ర౦లో నిరుద్యోగులకి ప్రభుత్వం తీపి కబురు అందించనుంది . వైద్యారోగ్యశాఖలో వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు కాంట్రాక్టు పద్ధతిలో 2100 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి చెప్పారు. రెండువేల పర్మినెంట్ పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించామని, సాంకేతిక, పాలనాపరమైన సమస్యల కారణంగా ఆ పోస్టుల భర్తీకి సమయం పట్టే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2100 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో …
Read More »మున్సిపల్ అధికారుల్లారా ఇకనైనా మారండి..!
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో చినుకురాలితే చిత్తడి అవుతుంది..భారీ వర్షాలు వస్తే భాగ్యనగరం కాస్తా సాగరంగా మారుతుంది.. రోడ్లన్నీ చెరువుల్లా మారుతున్నాయి. వర్షాలు, వరదలు రాగానే జీహెచ్‌ఎంసీ అధికారులు కండితుడుపు చర్యలు చేపడుతున్నా..శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నించడంలో అలసత్వం వహిస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్‌లో రోడ్లు దారుణంగా ఉన్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులను అప్రమత్తం చేస్తున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారు. ఒక్కసారి శ్రీనగర్ కాలనీ, …
Read More »కోదాడ, హుజూర్‌నగర్‌లను పట్టించుకోని భార్యాభర్తలు..!
ఉమ్మడి నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గాలు కోదాడ, హుజూర్‌నగర్‌లు ఆర్థికంగా శక్తివంతమైనవి. ఈ రెండు నియోజకవర్గాలు రైస్‌బౌల్‌గా నిలుస్తున్నాయి..అంతే కాదు చుట్టూ సిమెంట్ ఫ్యాక్టరీలతో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలు పారిశ్రామిక కేంద్రాలుగా పేరుగాంచాయి.అయితే అభివృద్ధిలో మాత్రం ఈ రెండు నియోజకవర్గాలు పూర్తిగా వెనుకబడిపోయాయనే చెప్పాలి. కోదాడ, హుజూర్‌నగర్‌లలో అంతర్గత రోడ్లు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిత్యం వందలాది సిమెంట్ లారీలు రెండు నగరాలలో ప్రధాన రహదారులపై పయనిస్తుండడంతో కాలుష్యం …
Read More »హన్మకొండ-ఖాజీపేట వద్ద రెండో ఆర్వోబి మంజూరు..!
హన్మకొండ నుంచి ఖాజీపేటకు వెళ్లాలంటే ఆ ఒక్క రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబి) మాత్రమే మార్గం. అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా, మరమ్మత్తులు చేపట్టినా తొందరగా వెళ్లాలనుకునే వారికి నరకం కనపడాల్సిందే. ఈ ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి లభించాలంటే ఆర్వోబి పక్కనే సమాంతరంగా మరొక ఆర్వోబి ఉండాలని వరంగల్ వాసులు చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్ ఇన్నాళ్లుగా డిమాండ్ గానే మిగిలింది. గత …
Read More »మహబూబాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం… ఎంపీ కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానుకోట జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. నిన్న సింగరేణి ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఈ రోజు మహబూబాబాద్‌కు వచ్చిన ఎంపీ కవిత ఈసందర్భంగా మీడియాతో మాట్లాడారు. “కొత్తగూడెంలో సింగరేణి ప్రచారం ఘనంగా ముగిసింది. గ్రామాలను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం. తెలంగాణలో నిరంతరం విద్యుత్ ఇచ్చి …
Read More »తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసిన మంత్రి హరీష్
తపాస్‌పల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా సిద్ధిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. గోదావరి నీళ్లు మొట్టమొదటి సారి సిద్ధిపేట జిల్లాకు తెచ్చామని తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పారు. ఉమ్మడి మెదక్ …
Read More »టీటీడీపీలో గందరగోళం..పొత్తులపై మోత్కుపల్లి రివర్స్..రేవంత్ రెడ్డి దారెటు…!
తెలంగాణలో అసలే కొనవూపిరితో ఉన్న టీటీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శల్యసారథ్యం వహిస్తు న్నాడు. రేవంత్ ఒక్కడే కేసీఆర్‌తో పోరాడుతున్నా కానీ ఆయనకు సొంత పార్టీలోనే మద్దతు ఇచ్చేవారు కరువు అవుతున్నారు..ఇప్పటికే మెజార్టీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైకిల్ దిగి కారు ఎక్కగా వచ్చే ఎన్నికల కల్లా ఉన్నవాళ్లలో 70 శాతం మంది నాయకులు, క్యాడర్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కంటే రేవంత్ ఒంటెద్దు పోకడలే అని …
Read More »సమ్మక్క, సారలమ్మ జాతరకు 80 కోట్లు…!
సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసినందున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి చందూలాల్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఆసియా ఖండంలో …
Read More »కేంద్ర మంత్రికి మంత్రి హరీశ్‌రావు లేఖ
తెలంగాణ రాష్ట్ర౦లో ప్రధాన పంటలో ఒకటిగా ఉన్న సోయాబీన్ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు కోరారు. తెలంగాణలో సోయాబీన్ పంట ఎక్కువగా ఉత్పత్తి అయిన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి కేంద్ర సంస్థలతో పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి టి.హరీశ్‌రావు ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ‘తెలంగాణలో 1.64 లక్షల హెక్టార్లలో సోయాబీన్ సాగు …
Read More »