సౌర విద్యుదుత్పత్తితో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరింది. ఈ విద్యుదుత్పత్తి గణనీయంగా పెరగడంతో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తేరుకున్నాయి. ప్రస్తుతం రోజూ గరిష్ఠంగా 2,357 మెగావాట్ల మరో 4 నెలల్లో అదనంగా వెయ్యి మెగావాట్లు పెరిగి జనవరికల్లా 3400 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. సేద్యానికి నిరంతరాయ సరఫరాతో… గతనెలలో రాష్ట్రంలో రోజువారీ విద్యుత్తు వినియోగం అత్యధికంగా 9 వేల మెగావాట్లకు చేరడంతో భారీగా ‘భారత ఇంధన ఎక్స్ఛేంజి’(ఐఈఈ)లో …
Read More »సింగరేణిలో 60.46 శాతం పోలింగ్ నమోదు..!
సింగరేణి వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. కార్మికులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 60.46 శాతం పోలింగ్ నమోదు అయింది. కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాలో 63.95 శాతం పోలింగ్ నమోదు అయింది. శ్రీరాంపూర్‌లో 60 శాతం, మందమర్రిలో 59.23 శాతం, బెల్లంపల్లిలో 71.66 శాతం, భూపాలపల్లిలో 52 శాతం, రామగుండం ఆర్‌జీ1లో 60 శాతం, ఆర్‌జీ2లో 52 శాతం పోలింగ్ నమోదు అయినట్టు పోలింగ్ అధికారులు తెలిపారు.
Read More »సింగరేణిలో ఇప్పటివరకు 52 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కార్మికులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌తో కలిపి 11 ఏరియాల్లో ఇప్పటి వరకు 52 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు ప్రకటించారు.
Read More »పేదోళ్ళ ఆశాదీపం.. నేడు కాకా 88వ జయంతి…!
‘కాకా’ అంటూ అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే గడ్డం వెంకటస్వామి రాజకీయాల్లో కాకలుతీరిన నేతగానే కాదు.. పేదల పెన్నిధిగానూ పేరు ప్రతిష్టలు సంపాదించారు. వెంకటస్వామి సేవలు గుడెసెల్లో ఉండే నిరుపేదలకు చిరస్మరణీయం. అందుకే ఇంటి పేరు గడ్డం మరుగున పడి, గుడిసెల వెంకటస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ రోజు ఆయన 88వ జయంతి. ఆది నుంచి కాంగ్రె్‌సను నమ్ముకొని చివరి శ్వాస వరకు అదే పార్టీలో కొనసాగారు. గడ్డం వెంకటస్వామి అక్టోబరు …
Read More »సింగరేణిలో గులాబీ జెండా ఎగరడం ఖాయం…!
సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని, అపవిత్ర కూటమిగా సింగరేణి ఎన్నికల్లో పోటి చేస్తున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీకి ఓటమి తప్పదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఓట్ల కోసం కార్మికులకు మద్యం, డబ్బు పంపిణీ చేయడం నీతి బాహ్యమని, ఎన్ని కుప్పి గం తులు వేసిన సింగరేణిలో గులాబీ జెండా ఎగిరి తీరుతుందని స్పష్టం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో విలేకరు లతో మాట్లాడుతూ …
Read More »నేడు, రేపు భారీ వర్షం
తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై ఉపరితలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా ఉన్నదని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండురోజులపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గురువారం ఓ …
Read More »నేడే సింగరేణి సమరం ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జరుగుతున్న తోలి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది .సింగరేణి సంస్థ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు మొత్తం ఆరు సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి .మొదటిగా సరిగ్గా పంతొమ్మిది యేండ్ల కిందట అంటే సెప్టెంబర్ 9న 1998లో మొదటి సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నిక జరిగింది. దీని తర్వాత వరసగా2001 ఫిబ్రవరి 19న రెండోసారి, 2003 మే 14న మూడోసారి, 2007 …
Read More »2015 జూలై 3న కేసీఆర్ నాటిన మొక్క ఎలా ఉందో తెలుసా..?
రెండేళ్ల ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాటిన హరితహరం మొక్క నేడు వృక్షమై శ్రీ వేంకటేశ్వరస్వామి పూజకు పత్రాలు, పుష్పాలు అందిస్తున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి ఉపయోగపడడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు దోహదపడుతున్నది. అటవీ ప్రాంతాల్లోనే కాకుండా జనావాసాల్లో, గుడులు, మసీదులు, చర్చి ప్రాంగణాల్లో కూడా మొక్కలు నాటాలనే సంకల్పం నెరవేరుతున్నది. 2015 జూలై 3న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. …
Read More »సైకిల్‌పై సవారీ చేసిన మంత్రి హరీశ్…!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ రోజు సిద్దిపేటలో సైకిల్‌పై సవారీ చేశారు. హరితమిత్రులకు సైకిళ్ళు పంపిణి చేసిన మంత్రి అనంతరం.. సిద్దిపేట పట్టణంలో సైకిల్ పై ఇతర కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. హరీశ్ రావు వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీశ్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఉన్నారు.
Read More »నీటి నిల్వకు మరో భగీరథ యత్నం…!
నేలపై జాలువారే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకొని భూగర్భజలాలు పెంచడం…ప్రకృతిని కాపాడటం..పశుపక్ష్యాదులకు నీడ కల్పించడం…పచ్చని పంటకు ఆదరువుగా ఉండటం లక్ష్యంగా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికలలో మరో ముందడుగు వేసింది. వంతెనలను కేవలం సాఫీగా సాగే ప్రయాణం కోసమే కాకుండా…నేలపై పడిన చినుకును ఒడిసిపట్టే నీటినిల్వ కేంద్రంగా కూడా మార్చేందుకు ప్రణాళిక వేసింది. మెరుగైన ప్రజా రవాణలో భాగంగా వంతెనల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు …
Read More »