తెలంగాణ రాష్ట్ర౦లో సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సింగరేణి కార్మికులు 11 డివిజన్లలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 11 డివిజన్లలో మొత్తం 94.93 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 52,534 ఓట్లకుగాను 49,873 ఓట్లు నమోదయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 12 గంటల వరకు తుది …
Read More »కాళేశ్వరం పనులు నిలిపివేత…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) గురువారం స్టే విధించింది. పూర్తి స్థాయి అటవీపర్యావరణ అనుమతులు వచ్చే వరకు ఎలాంటి పనులూ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు రాకుండానే పనులు మొదలుపెట్టారని ఎన్జీటీలో పిటిషన్ దాఖలు కావడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ ప్రాజెక్టుపై స్టే విధించింది. ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ …
Read More »నల్గొండ ఉప ఎన్నికపై సీక్రెట్ సర్వే..టీ కాంగ్రెస్‌కు షాకింగ్ రిజల్ట్…!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలలో కాంగ్రెస్‌దే పై చేయి.. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో కమ్యూనిస్టుల కోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లా గత రెండు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలుస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ హవాలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెల్చుకోగలిగింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, కాంగ్రెస్‌లో ఆర్థికంగా శక్తివంతమైన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలా కాంగ్రెస్ అగ్ర …
Read More »సింగరేణి పోలింగ్… 4 గంటల వరకు 92.81 శాతం
సింగరేణి లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సాయంత్రం 4 గంటల వరకు 92.81 శాతం పోలింగ్ నమోదైంది. ఇల్లందులో 97.03 శాతం, కొత్తగూడెం 95.07 శాతం, కార్పొరేట్ ఏరియాలో 94.51 శాతం పోలింగ్ నమోదు కాగా..మణుగూరులో 96.43 శాతం , శ్రీరాంపూర్ 92.99 శాతం , మందమర్రి-92.75 శాతం, బెల్లంపల్లి-95.41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read More »సింగరేణి పోలింగ్.. 3 గంటల వరకు 85.30 శాతం
సింగరేణిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 3 గంటల వరకు 85.30 శాతం పోలింగ్ నమోదైంది. ఇల్లందులో 89 శాతం పోలింగ్ నమోదు కాగా..శ్రీరాంపూర్ లో 86 శాతం, కొత్త గూడెం-87 శాతం, మణుగూరు- 90.53 శాతం, మందమర్రి-76 శాతం, బెల్లంపల్లి-86 శాతం , భూపాలపల్లి-79 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read More »నీళ్లను దోచుకుపోతున్నా..నోరు మెదపని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు..!
తెలంగాణ రాష్ట్ర౦లో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో రైతు బజార్ ను మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. నాగార్జున సాగర్ నీళ్లను ఆంధ్రకు దోచుకుపోతున్నా..నోరు …
Read More »ఘనంగా కాకా 88వ జయంతి వేడుకలు ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి 88వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న కాకా విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి దేశానికి …
Read More »వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి…!
తెలంగాణ రాష్ట్ర౦లోని నల్లగొండ జిల్లాలో బత్తాయి, నిమ్మ, దొండ మార్కెట్ల నిర్మాణం జరుగుతున్నదని..రెండు, మూడు నెలల్లో వాటిని పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో గతం కంటే 20 రెట్ల స్థాయిలో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించినట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంలో మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి రైతు బజార్ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ నేతలపై సింగిరెడ్డి ఫైర్ ..
తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట్ పొలికెపహాడ్ గ్రామ సమీపంలోని తూడుకుర్తి గ్రామ శివారులో ఉన్న కేఎల్‌ఐ డీ-8 కాలువను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పాటు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసులతో అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి నిరోధకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ప్రతిపక్షాలు …
Read More »వాల్మీకి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం..
హైదరాబాద్ లోని బషీర్‌బాగ్‌లో భారతీయ విద్యాభవన్‌లో ఆదికవి శ్రీ వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కడియం… వాల్మీకి బంధువులందరి అభిమానంతో ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతున్నదని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వాల్మీకి …
Read More »