Home / TELANGANA (page 1169)

TELANGANA

చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ..పొత్తులపై చర్చ…!

తెలంగాణ టీడీపీ నేతలు ఇవాళ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో తెలంగాణ టీడీపీ నేతల మధ్య గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంచతరించుకుంది. టీటీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ తదితర నేతలు బాబుతో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్‌తో …

Read More »

కూకట్‌పల్లిలో కుంగిపోయిన రోడ్డు..

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి ఎల్లమ్మబండ మార్గంలో ఈ ఉదయం ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ఉషాముళ్లపూడి కమాన్‌ వద్ద నుంచి ఎల్లమ్మబండకు వెళ్లే మార్గంలో తెలంగాణ కూడలి వద్ద రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. నీటి పైప్‌లైన్‌ పగిలి గొయ్యి నుంచి భారీగా నీరు ఉబికివస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఆ మార్గంలో వెళ్లేవారిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Read More »

విపక్షాలకు సింగరేణి ఎన్నికల ఫలితాలు చెప్పిన పాఠం ..!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల అయిన సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించడం ఆ పార్టీకి ఆనందదాయకమే.ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజమాబాద్ ఎంపీ కవిత ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని ప్రచారం నిర్వహించి , మొత్తం ఎన్నికలకు విశేష ప్రాధాన్యం తెచ్చారు. చివరికి ముఖ్యమంత్రి కూడా రంగంలో దిగి సింగరేణి కార్మికులను …

Read More »

మహిళా కానిస్టేబుల్ ఉద్యోగం….కాని ఈ ఒక్క కారణంతో ఆత్మహత్య

హైదరాబాద్‌లోని రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. వసతిగృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని నవీన అనే ట్రైనీ కానిస్టేబుల్ బలవన్మరణం చెందింది. నల్గొండకు చెందిన నవీన, వేములపల్లికి చెందిన మరో ట్రెయినీ కానిస్టేబుల్ మాధవి మంచి స్నేహితులు. అయితే తనకు ఇష్టంలేని పెళ్లి కుదిర్చారని కలతచెందిన మాధవి శనివారం తన స్వగ్రామంలో ఆత్మహత్యకు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవీన పోలీస్ …

Read More »

చంద్రబాబును అవమానించిన రేవంత్‌‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి జంప్ అవడం ఖాయమేనా..!

తెలంగాణ టీడీపీ నాయకుడు రేవంత్‌ రెడ్డి త్వరలో పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయమేనా…చంద్రబాబును సైతం ధిక్కరించబోతున్నాడా…త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాడా…ప్రస్తుతం జరుగుతున్నపరిణామాలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది..గత కొంత కాలంగా టీడీపీ అధినాయకత్వం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. పరిటాల శ్రీరామ్ పెండ్లిలో టీడీపీ నాయకులు కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం పలికారు. మెజార్టీ టీడీపీ నేతలు కేసీఆర్‌ను ఓన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా కేసీఆర్‌తో పోరాటానికి టీటీడీపీ నేత రేవంత్ …

Read More »

టీడీపీకి బాబుకు అత్యంత సన్నిహితుడు గుడ్ బై …

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఆయన .నాడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ విశ్వ విఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ మీద హైదరాబాద్ మహానగరంలో లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అప్పటి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరాడు అనే ఆరోపణలు ఉన్న తెలంగాణ ప్రాంత సీనియర్ మాజీ మంత్రి ,గవర్నర్ …

Read More »

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్టంలో  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా రెండు వేర్వేరు శాఖల్లో 257 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ శనివారం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి ఇచ్చిన వాటిలో జైళ్లశాఖలో 238, అటవీశాఖలో 19 పోస్టులు ఉన్నాయి. జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్లు-15, అసిస్టెంట్ మ్యాట్రన్ -2, వార్డర్ (పురుష)-186, వార్డర్ (మహిళ)- 35 ఖాళీలు ఉన్నాయి. అటవీశాఖలో 19 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులు ఉన్నాయి. కొలువుల …

Read More »

ప్రతిపక్షాలకు రేవంత్ పిలుపు ..

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే ,ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు .ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై చేసిన కామెంట్ల గురించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇక నుండైన జరిగే ప్రతి ఎన్నికల్లో కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ మనస్పర్థలు వీడి ఒక్క తాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాల మధ్య ఉన్న బలహీనతలనే కేసీఆర్‌కు బలంగా …

Read More »

పోలీస్‌ శాఖకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…

ముఖ్యమంత్రి కేసీఆర్  పోలీస్‌శాఖకు తీపి కబురు అందించారు ..  పోలీస్‌శాఖలో పదోన్నతులకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతి అంశం ఓ కొలిక్కి వచ్చినట్లైంది. పోలీసు అధికారుల పదోన్నతుల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్ లో న్యాయశాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులతో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఏకంగా 275 మందికి …

Read More »

ఆ పోస్టులను తక్షణమే భర్తీ చేయండి… కేసీఆర్ ఆదేశం

తెలంగాణ  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారు. అన్ని శాఖల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు సేకరించి.. వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలున్న అభ్యర్థులు ఆయా వర్గాల్లో ఉన్నప్పటికీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండటం అన్యాయమన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్ కలిసి ఇకపై ప్రతీ నెలా చివరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat