సాహసాలతో సహవాసం చేయడం వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి అలవాటుగా మారింది.. . గతంలో బయ్యారం ఫారెస్టులో 12 కిలోమీటర్లు నడిచి సంచలనం రేపిన ఆమ్రపాలి ఆ తర్వాత అత్యంత సాహసోపేతంగా పాండవుల గుట్టల్లో జరిగిన రాక్ ఫెస్టివల్‌లో ఎత్తైన గుట్టలు అవలీలగా ఎక్కి ఔరా అనిపించారు. తాజాగా ఆమ్రపాలి మళ్లీ మరోసారి ట్రెక్కింగ్ చేశారు. ఈ రోజు వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఇనుపరాతి గుట్టలపై అటవీ శాఖ …
Read More »పర్యావరణ పరిరక్షణకే మానవ వ్యర్ధాల శుద్దీకరణ ప్లాంట్ – మేయర్ నరేందర్…
త్వరలో దేశం మొత్తం వరంగల్ వైపు చూడనుంది. చారిత్రిక సంపద ,ఎన్నోకళలకు పుట్టినిల్లైన ఓరుగల్లు నగరం ఇప్పటికే ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. చెత్త…చెత్త…కాదు సద్వినియోగం చేసుకుంటే చెత్తకూడా ఉపయోగంలోకి వస్తుంది.ఈ నినాదం అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లలో వినిపిస్తోంది.కానీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక చెత్తనే కాదు మానవ వ్యర్ధాలను శుద్దీకరిస్తే వాటిని కూడా ఉపయోగించుకోవచ్చని మరికొన్ని రోజుల్లో వరంగల్ మహానగరపాలక సంస్థ నిజం చేయబోతుంది.దేశంలోనే మొదటి …
Read More »పెళ్లైన తెల్లారే భర్త కళ్లుగప్పి భార్య …. ఏం జరిగింది?
పెళ్లైన తెల్లారే భర్త కళ్లుగప్పి భార్య ఉడాయించిన ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసర మండలం ఆర్‌ఎల్ నగర్‌కు చెందిన మాదినేని తిరుపతయ్య (23) పాల వ్యాపారం చేస్తూ నగరంలో స్థిరపడ్డాడు. అతడు అక్టోబర్ 1న కడప జిల్లా మైదుకూరుకు చెందిన రాజపుత్ర శివమల్లేశ్వరి (19)ని వివాహం చేసుకున్నాడు. మైదుకూరులో స్థానిక రాఘవేంద్రస్వామి ఆలయంలో పెళ్లి చేసుకుని …
Read More »కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు!
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. బాలల హక్కులను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దు చేస్తూ ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, బాలల హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ సభ్యుల నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్చుతారావు నెల రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు …
Read More »సూర్యాపేట సాక్షిగా కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ సెటైర్ల వర్షం ..
తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రగతి సభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలపై సెటైర్ల వర్షం కురిపించారు .మొత్తం రెండు గంటల్లో ఆరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు .అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా చైతన్యంలో ముందు నిలిచిన జిల్లా ..ఉద్యమాల పోరాటాల …
Read More »ఆ ఒక్క మాటతో ఉమ్మడి “నల్గొండ “జిల్లా ప్రజల మది దోచుకున్న సీఎం కేసీఆర్ ..
తెలంగాణ సీఎం ,రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .అంతే కాకుండా జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు తన చేతుల మీదుగా అందజేశారు . అనంతరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు …
Read More »ఆదర్శంగా నిలిచిన మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం ఇటు అధికారక కార్యక్రమాల్లో అటు ప్రజాక్షేత్రంలో బిజీ బిజీగా ఉండే నాయకుడు .ఎన్నో యేండ్ల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి తన వంతు పాత్రగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ,కొత్త ప్రాజెక్టులను శరవేగంగా పూర్తీ అయ్యే విధంగా ఇరవై నాలుగు గంటలు ప్రాజెక్టుల …
Read More »తుమ్మల అపర భగీరథుడు ..ఖమ్మం జిల్లా ప్రజల అదృష్టం ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా నూతన కలెక్టర్ ,పోలీస్ శాఖ భవనాల నిర్మాణ పనుల శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు . తదనంతరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ …
Read More »ఏడాదిన్నరలో యాదాద్రి పవర్‌ప్లాంట్…
తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నల్లగొండ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లున్న జిల్లా పాత నల్లగొండ జిల్లా. 60 సంవత్సరాల చరిత్రలో జిల్లా నాయకులు చేయని పనిని తాను తలపెట్టినట్లు సీఎం తెలిపారు. 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మొట్టమొదటి …
Read More »లక్షమంది ఉత్తమ్‌లు వచ్చినా కాళేశ్వరాన్ని అడ్డుకోలేరు..
సూర్యాపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ సాధనను జీవిత లక్ష్యంగా పెట్టుకుని అనేక పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. కష్టపడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలో టీఆర్‌ఎస్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ప్రజలు తమని గెలిపించారని సీఎం అన్నారు. …
Read More »