తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది. తాము అదనంగా 35 లక్షల కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో త్వరలో తమకు …
Read More »తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా..కారణం ఇదే..?
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం ఈ నెల పదిహేడో తారీఖున జరగాల్సింది వాయిదా పడింది. రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి టీచర్స్,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెల్సిందే. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మరో కొత్త తారీఖును తెలియజేస్తామని తెలిపింది.
Read More »గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు శుభవార్తను తెలిపింది. ఎస్టీ విచారణ సంఘం ఆరేండ్ల కిందట 2016లో ఇచ్చిన సిఫారసుల మేరకు వాల్మికీ,బోయ,బేడర్,కిరాతక,నిషాద్,పెద్దబోయలు,తలయారి,చుండువాళ్లు,కాయితి లంబాడాలు,భాట్ మధురాలు ,చమర్ మధురాలను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న 11.5లక్షల పోడుభూములను పట్టాలుగా గిరిజనులకు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో …
Read More »తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 11న నామినేషన్లను స్వీకరించనున్నారు. 12వ తేదీన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరు ఖరారు అయింది. బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా 2021, నవంబర్ నెలలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్న విషయం విదితమే.
Read More »ఎంసెట్ పరీక్షలకు హాజరై విద్యార్థులకు శుభవార్త
తెలంగాణలో మే 7న ఎంసెట్ పరీక్ష జరగనున్న సంగతి విదితమే. అయితే ఈ పరీక్షలకు హజరై విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్లో ఇంటర్ ఫస్టియర్ 70% సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. సెకండియర్లో 100% సిలబస్ చదవాల్సిందేనని పేర్కొన్నారు. 2021-22లో కరోనా కారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70% సిలబస్తో పరీక్షలు రాశారని.. ఎంసెట్లో కూడా అదే సిలబస్ ఉంటుందన్నారు.
Read More »ఈ నెల 11న హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న ట్రైనీ ఐపీఎస్ల పరేడ్కు ఆయన హాజరవుతారు. 190 మంది ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా అమిత్ షా వారితో మాట్లాడనున్నారు. వీరిలో 29మంది విదేశీ ఆఫీసర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లు ఉన్నారు.
Read More »యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అమెరికాకు చెందిన ప్రొవిడెన్స్ హెల్త్ సిస్టమ్స్ కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను మూడింతలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 1,000 మంది పనిచేస్తున్నారని, ఆ సంఖ్యను 3వేలకు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీ సీఈవో డాక్టర్ రాడ్ హోచ్మన్, సీఐవో మూర్, ఇండియా హెడ్ మురళీ కృష్ణలు భేటీ అయ్యారని ట్విటర్లో పేర్కొన్నారు.
Read More »అదానీ స్టాక్స్ మోసాలపై పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన
దేశంలో సంచలనం సృష్టించిన అదానీ స్టాక్స్ మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని భారత్ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇవాళ పార్లమెంట్‌లో డిమాండ్ చేశాయి. ఉభయసభలను బహిష్కరించిన ఇరు పార్టీలు.. పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, ఆప్ పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేశారు. అదానీ సంక్షోభంపై తేల్చేందుకు జేపీసీతో విచారణ చేపట్టాలని డిమాండ్ …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ టీచర్ ఎమ్మెల్స స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోటఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మార్చి 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా …
Read More »రైతులను ముక్కు పిండి రుణాలను వసూలు చేయాలి-బీజేపీ ఎంపీ
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి తన రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకొన్నది. పంట నష్టపోయిన రైతన్నలకు అండగా వారి రుణాలు మాఫీ చేయడం ఘోరమైన తప్పిదమన్నట్టుగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైతు రుణమాఫీతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమని, రైతుల నుంచి రుణాలను ముక్కుపిండి వసూలు చేయాల్సిందేనని …
Read More »