అరువై ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా, ఈ మూడేండ్లలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, అందరి కండ్లల్ల్లో ఆనందం నింపిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు, సీనియర్ నాయకుడు బాషా రెండువేల మంది కార్యకర్తలతో మంత్రి సమక్షంలో ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా …
Read More »నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రివర్గం నేటి మధ్యాహ్నం భేటీ కానుంది. హైదరాబాద్ నగర పరిధిలోగల ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలతో పాటు ప్రభుత్వం తరపున ప్రస్తావించాల్సిన అంశాలపైనే కేబినేట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే, శాసనసభ, మండలిలో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టాల్సిన …
Read More »రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై రమణ ఏమన్నారంటే..?
పార్టీ మారబోనంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు . తాను పార్టీ మారడం లేదంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలో ఏమాత్రం స్పష్టత లేదని రమణ అన్నారు. .. కాంగ్రెస్ నేతలను కలిశారన్న వార్తలను రేవంత్ ఖండించాలన్నారు. తమ పార్టీ నేతలను రేవంత్ …
Read More »ఇంత జరిగినా..సిగ్గులేని ఆరోపణలు ఎందుకు శ్రీధర్ బాబు?ఎంపీ బాల్క
కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు మేకవన్నె పులి నైజం బయటపడిందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. నీచమైన, నికృష్టమైన నైజం మాజీ మంత్రి శ్రీధర్ బాబు సొంతమని… టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని గంజాయి కేసు లో ఇరికించాలని చూసిన వైనం బట్టబయలవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీలో నిర్వహించిన విలేకరుల సమావేశలో ఎమ్మెల్సీ లు భానుప్రసాద్, గంగాధర్ గౌడ్‌తో కలిసి ఎంపీ బాల్కసుమన్ విలేకరుల …
Read More »పార్టీ మార్పుపై స్పందించిన రేవంత్ రెడ్డి..!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న కథనాలపై స్పందించారు..ఈ రోజు మీడియాతో అయన మాట్లాడుతూ.. నేను పార్టీ మారడంలేదని, కార్యకర్తలు కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు .. టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.. అన్ని విషయాలు చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని రాగానే …
Read More »నిర్ణీత సమయానికే గ్రామ పంచాయతీ ఎన్నికలు..కేసీఆర్
గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్ణీత సమయానికే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం.. ఈ విషయాన్ని ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చెప్పిన మాట ప్రకారం.. లంబాడీ, ఆదివాసీ తండాలను, గూడెంలను పంచాయతీలుగా మార్చబోతున్నామని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. …
Read More »పరకాలకు 50 కోట్లు.. సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పరకాలకు వరాలు ప్రకటించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పరకాల అభివృద్ధికి రూ. 50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విజ్ఞప్తి మేరకు పరకాలను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆదేశాలను ఇస్తామని సీఎం …
Read More »లక్ష మందికి పైగా ఉపాధి..సీఎం కేసీఆర్
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తా యని సీఎం కేసీఆర్ అన్నారు .వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ … ఈ ఒక్క రోజే 22 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. పారిశ్రామికవేత్తలు రాష్ట్రప్రభుత్వంతో …
Read More »వరంగల్ జిల్లా ప్రజలను అభినందిస్తున్నా..సీఎం కేసీఆర్
భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేయించుకున్నందుకు వరంగల్ ప్రజల అందరిని అభినందిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో మన వరంగల్ చుట్టుపక్కల ఉండే వర్ధన్నపేట, పరకాలతో పాటు ఇతర నియోజకవర్గాల …
Read More »సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్..సీఎం కేసీఆర్
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ …. దేశంలో ఎక్కడా లేని విధంగా 50 అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ కిట్స్‌ను ప్రజలు బాగా ఆదరిస్తున్నారని తెలిపారు. గర్భిణులకు 12 వేల రూపాయాలు అందిస్తున్న విషయం …
Read More »