రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు తలపెట్టిన ఛలో అసెంబ్లీని తెలంగాణ పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.చలో అసెంబ్లీకి అనుమతి లేదని నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజే ఈ ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి కాంగ్రెసే బాధ్యత వహించాలని హెచ్చరించింది.హైదరాబాదు నగర శివారుల్లో పెద్ద సంఖ్యలో …
Read More »ఎన్ని రోజులైనా మాట్లాడేందుకు మేం సిద్ధం.. మంత్రి హరీష్
ఏ అంశమైనా..ఎంత సేపైనా..ఎన్నిరోజులైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో.. కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేయడం సరికాదన్నారు. అందరు సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి హరీష్ తెలిపారు.కాంగ్రెస్ నేతలు చర్చ కంటే.. రచ్చకే సిద్ధంగా ఉన్నారని ఇవాళ మరోసారి రుజువైందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సభ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీదే కాదన్నారు. సభలో ఎన్ని …
Read More »నాలాల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు..కేటీఆర్
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో నాలాల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.బహుముఖ వ్యూహం అవలంభించి నాలాల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. నాలాలపై అక్రమ నిర్మాణాలకు పరిహారం చెల్లించాలనే యోచనలో ఉన్నట్లు …
Read More »కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్..!
ఈ రోజు శాసనసభ శీతాకాల సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే .ఈ సందర్భంగా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఫైర్ అయ్యారు . టీఆర్ఎస్ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రచ్చకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ సభ్యులు 20 రోజులు సభ నడపాలన్నారు.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా
ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఉభయ సభల్లో 11.30 గంటల వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.శాసనసభను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మండలిని ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత.. సభ, మండలిని వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. ఉభయసభలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.
Read More »ఇప్పటి వరకు 26 లక్షల గొర్రెలను పంపిణీ చేసాం..మంత్రి తలసాని
అర్హులైన గొల్ల కురుమలకు ఇప్పటి వరకు 26 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు. రాష్ట్రంలోని గొల్లకురుమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తెలిపారు. వీరిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. గొర్రెల పంపిణీతో పాటు మేత, ఔషధాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా …
Read More »త్వరలోనే హోంగార్డుల సమస్యను పరిష్కరిస్తాం..సీఎం కేసీఆర్
త్వరలోనే హోంగార్డుల సమస్యను పరిష్కారిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం మాట్లాడారు.రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్దీకరిస్తామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. శాశ్వత ఉద్యోగాల కోసం ఔట్‌సోర్సింగ్ తీసుకోవడం నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వీరిని క్రమబద్దీకరించే క్రమంలో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయని తెలిపారు.గత ప్రభుత్వాలు …
Read More »రేవంత్ రెడ్డిపై ఎల్.రమణ సంచలన వాఖ్యలు..
తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మరోసారి సంచలన వాఖ్యలు చేసారు . ఈ రోజు హైదరాబాదులో మీడియాతో అయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని… వారే పార్టీ తరపున పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పారు.ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబం నుంచి తాను వచ్చానని… రేవంత్ రెడ్డి ఎక్కడ నుంచి వచ్చారో అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు …
Read More »ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది..మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అయన తెలిపారు.రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సెక్టార్ పూర్తిగా …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగిన అక్బరుద్దీన్ ఓవైసీ
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. శాసనసభలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభకు అంతరాయం కలిగిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అయన ఫైర్ అయ్యారు . ప్రశ్నోత్తరాలకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. బీఏసీలో నిర్ణయించిన మేరకు సభ్యులంతా సభకు సహకరించాలని చెప్పారు.సభ సజావుగా సాగేందుకు కాంగ్రెస్ సభ్యులు సహకరించాలని కోరారు. సభకు ఆటంకం కలిగినస్తున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా …
Read More »