గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ లో మేయర్ నన్నపునేని నరేందర్ బైక్ పై పర్యటించారు.బైక్ పై వీది వీది కలియదిరుగుతూ ప్రజల వద్దకు వెల్లి సమస్యలు అడిగితెలుసుకున్నారు.మురికాలువలు,సీసీ రోడ్లు,సానిటేషన్ ను పరిశీలించిన మేయర్ వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.స్వయంగా మేయర్ నే తమ వద్దకు రావడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తంచేశారు . ఈ సందర్బంగా కాలనీ లోని సమస్యలను కాలనీ వాసులు మేయర్ కు వివరించారు.వెంటనే …
Read More »జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. బేగంపేటలోని హరితప్లాజాలో సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్ నగర అభివృద్ధి కార్యక్రమాలను కార్పొరేటర్లకు మంత్రి వివరిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణ నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కార్పొరేటర్లకు సూచించారు.
Read More »రేవంత్ రెడ్డి జాతకం తేలేది నేడే..?
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం గత కొన్ని రోజులనుండి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ రోజు రేవంత్ పార్టీ మార్పు పై స్పష్టత రానున్నది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్‌లో లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో …
Read More »హైదరాబాద్ విషయంలో…ఫలించిన సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ కృషి
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆర్థికంగా బలోపేతమైంది. గడిచిన రెండేళ్ల క్రితం సంస్థ ఖజానా కేవలం రూ. 10కోట్లకు మించని పరిస్థితి నుంచి ప్రస్తుతం రూ. 432 కోట్లకు చేరి స్వయం సమృద్ధిని సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యానికి గురై..చేతిలో చిల్లి గవ్వ లేకుండా ప్రతిపాదిత ప్రాజెక్టులు పట్టాలెక్కక, ఇటు నిధుల కొరతతో అసంతృప్తి నిలిచిపోయిన పథకాలు, అనుమతుల జారీలో అవినీతి మయం..మొత్తంగా హెచ్‌ఎండీఏ అంటేనే …
Read More »గల్ఫ్ కార్మికులను షేక్ నుంచి విముక్తి కలిగించిన మంత్రి కేటీఆర్
దేశం కాని దేశంలో ఉపాధి కోసం యజమాని నమ్మించి మోసం చేస్తే…మంత్రి కేటీఆర్ ఆదుకున్నాడు. కువైట్‌లో ఉపాధి కోసం వెళ్లగా…వారి యజమాని నుంచి గత తొమ్మిది నెలలుగా సమస్యలు ఎదుర్కొంటుండగా మంత్రి ఆదుకున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన మగ్గిడి రాజశేఖర్, భీంగల్ మండలానికి చెందిన నీలం గంగాదర్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని హనుమాన్ గల్లీకి చెందిన కందుల సాయికుమార్ ఉపాధి కోసం కువైట్ …
Read More »కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలా చేసింది..
చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ కావాలనే తొలిరోజు సమావేశానికి అంతరాయం కలిగించిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పీ. సుధాకర్‌రెడ్డి తెలిపారు. తొలిరోజు మండలి సమావేశం వాయిదా ఆనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ కావాలనే తొలిరోజు సమావేశానికి అంతరాయం కల్గించిదన్నారు. ఇదంతా వారి ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని వెల్లడించారు. టీఆర్‌ఎస్ విప్ బీ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సభా సమావేశాల సజావుకు పూర్తి సహకారం అందిస్తామని …
Read More »పత్తి అమ్మిన వెంటనే నేరుగా రైతుల ఖాతాలోకి చెల్లింపులు..
పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ లను మార్కెటింగ్ మంత్రి హరిశ్ రావు ఆదేశించారు.ఇకపై ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు.తెలంగాణలో 200 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలు రైతులకు సమీపంలో ఉండే విధంగా వికేంద్రీకరించాలని హరీశ్ రావుకోరారు.పత్తి,ధాన్యం,మొక్క జొన్న, సోయాబీన్ తదితర పంటల దిగుబడి, మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న ధర …
Read More »దివ్యాంగుల సంక్షేమానికి రూ.33 కోట్లు..మంత్రి తుమ్మల
దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్‌కు అదనంగా రూ.33 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు . 2017–18 ఆర్థిక సంవత్సరంలో వికలాంగుల కోసం రూ.37 కోట్లు కేటాయించినట్లు అయన పేర్కొన్నారు.ఈ రోజు సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి తుమ్మల సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల కోసం రూ.7 కోట్లతో …
Read More »రూ.800 కోట్లతో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ..కేటీఆర్
మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మేథా సర్వో డ్రైవ్స్ సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్నది.ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.రూ. 600 కోట్లతో సంగారెడ్డి దగ్గర్లోని కొండకల్‌లో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల 2 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష …
Read More »బ్రేకింగ్ న్యూస్..తెలంగాణ తెలుగు తమ్ముళ్ళకు చంద్రబాబు షాక్..!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ నేతలతో అయన సమావేశం అయ్యారు.అనంతరం అయన మాట్లాడుతూ…ఏ పార్టీలోనైన సంక్షోభం రావడం, సమసిపోవడం చాలా సర్వసాధారణమని అన్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మొదటగా పెద్దవిగా కనిపిస్తాయనితరువాత చిన్నవైపోతాయని అన్నారు . తన హయాంలో పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొందని, అన్నింటి నుంచి బయటపడి తలెత్తుకు నిలిచామని అన్నారు.తెలుగుదేశం …
Read More »