తెలంగాణ రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఒకవైపు అధికారక కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్న కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టు చేసే సమస్యలను పరిష్కరించడంలో మాత్రం దేశంలోనే ఉన్న రాజకీయ నేతలకంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు అనే సంగతి తెల్సిందే .ఇప్పటికే ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ నెటిజన్లు పోస్టు చేసిన పలు సమస్యలను పరిష్కరించి ఇటు నెటిజన్లు అటు ప్రజల …
Read More »ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌కు సీఎం కేసీఆర్ పరామర్శ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేకానందగౌడ్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఇటీవలే వివేక్ మాతృమూర్తి కన్నుమూసిన విషయం విదితమే. ఇవాళ పదో రోజు కావడంతో సీఎం కేసీఆర్.. వివేక్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Read More »గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నాం.. మంత్రి పద్మారావు
తెలంగాణ రాష్ట్రంలో 98 శాతం గుడుంబాను నిర్మూలించామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గుడుంబా నిర్మూలన – పునరావాసంపై శాసనసభలో లఘు చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతామని సీఎం కేసీఆర్.. వరంగల్‌లో ప్రకటించిన విషయాన్ని పద్మారావు గుర్తు చేశారు. సీఎం ప్రకటన నాటి నుంచి నేటి వరకు గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. గుడుంబా …
Read More »ఆలం ఖాన్ కుటుంబానికి కేసీఆర్ పరామర్శ
ప్రముఖ పారిశ్రామికవేత్త అన్వర్ ఉలూమ్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ అధినేత నవాబ్ షా అలంఖాన్(96) గత సోమవారం కన్నుమూసిన విషయం విదితమే.ఈ క్రమంలో బర్కత్‌పురాలోని అలంఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరామర్శించారు.ఆయనతో ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. చిరకాలంగా సాగిన స్నేహం జ్ఞాపకాలను ఆయన కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు.. అల్ఫాహారం అందించారు. . …
Read More »రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఏం చెప్పాడో తెలుసా…
కోడంగల్ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తో సహా పలువురు ముఖ్య నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి నివాసం నుంచి బయటికి వచ్చిన అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ..‘‘ కాంగ్రస్ పార్టీకి పునర్‌వైభవం వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరూ ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో …
Read More »రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్‌ను పార్టీకి రాహుల్ సాదరంగా ఆహ్వానించారు. రేవంత్‌తోపాటు మరికొందరు నేతలకు కూడా రాహుల్ కండువాలు కప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్ సీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. Our VP Rahul …
Read More »1962కు ఫోన్ చేస్తే అరగంటలో వైద్యం..
సంచార పశువైద్య శాలలతో పశువులకు సకాలంలో వైద్యం అందుతుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తలసాని మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 100 సంచార పశువైద్య శాలలను ప్రారంభించామని గుర్తు చేశారు. 1962కు ఫోన్ చేస్తే అరగంటలో పశువులకు వైద్యం అందుతుందన్నారు. పశుసంవర్ధక శాఖలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాల భర్తీకి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
Read More »భారతదేశ చరిత్రలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ అపూర్వఘట్టం..నాయిని
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పోలీసు శాఖపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమాధానం ఇచ్చారు.హైదరాబాద్ వేదికగా రూ. 350 కోట్ల అంచనాతో అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు . భారతదేశ చరిత్రలోనే ఇదొక అపూర్వఘట్టమని అయన అన్నారు . దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని హోంమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు …
Read More »MGMలో డయాలసిస్ సదుపాయాలు కల్పించండి..కొండా సురేఖ
గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు . ఇవాళ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ .. టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత కోట్లాది రూపాయిలు ఖర్చుపెట్టి విద్య, వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్ ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా వాసిగా మహాత్మాగాంధీ మెమొరియల్ ఆస్పత్రిని దశాబ్దాల కాలంగా చుట్టుపక్కలున్న ఐదారు జిల్లాల ప్రజలకు వైద్య సదుపాయం అందిస్తోందని ఈ …
Read More »త్వరలోనే మరిన్ని డయాలసిస్ సెంటర్లు
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యారోగ్య శాఖపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమాధాం ఇచ్చారు. రాష్ట్రంలో 40 కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మరిన్ని డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు . రాష్ట్రంలో 20 చోట్ల ఐసీయూ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. డయాలసిస్, ఐసీయూ సెంటర్ల …
Read More »