అబూధాబీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. చెన్నై ఇచ్చిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15 బంతులు ఉండగానే చేధించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్ బరిలో నిలిచేందుకు రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కావడంతో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కానీ.. టాస్ గెలిసి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు పేలవంగా …
Read More »ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడు
ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ జట్టుకు చెందిన బౌలర్ నార్జ్ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా (156.2KMPH)బంతి విసిరిన బౌలర్ గా నిలిచాడు. బుధవారం జరిగిన మ్యాచ్ లో ఈ సౌతాఫ్రికా బౌలర్ 156.22,155.21,154.74KMPH వేగంతో బంతులు వేసి ఔరా అన్పించాడు. ఈ దెబ్బకు టాప్ -10 ఫాస్టెస్ట్ బాల్స్ లో తొలి మూడు స్థానాల్లో నార్జ్ దే రికార్డు కావడం విశేషం. 154.4KMPH వేగంతో …
Read More »క్రికెట్ దిగ్గజం బయోపిక్‌లో స్టార్ హీరో
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ బయోపిక్‌కు సంబంధించి అప్‌డేట్‌ను ఇచ్చింది. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటింస్తున్నాడని అఫిషియల్‌గా ప్రకటించింది. మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ త్వరలోనే రానుంది. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి …
Read More »సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యఛేదనలో..రషీద్‌ఖాన్ (3/12), అహ్మద్(2/24), నటరాజన్(2/24) విజృంభణతో పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. పూరన్(37 బంతుల్లో 77, 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. తొలుత హైదరాబాద్.. బెయిర్‌స్టో(55 బంతుల్లో 97, 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), వార్నర్ …
Read More »తడబడి నిలబడ్డ తెవాతియ.. నిజంగా అద్భుతం
‘‘నన్ను నేను నమ్మాలని నిర్ణయించుకున్నాను. ఒక్క సిక్స్ కొట్టాలనుకున్నాను. తర్వాత అదే కొనసాగించాలని ఫిక్స్ అయ్యాను. అయితే ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టడం నిజంగానే అద్భుతం. నిజానికి లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదేందుకు కోచ్ నన్ను పంపించారు. దురదృష్టవశాత్తు ఆ పనిచేయలేకపోయాను. అయితే అంతిమంగా ఇతర బౌలర్లపై విజయం సాధించాను’’ అంటూ రాజస్తాన్ రాయల్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ తెవాతియా హర్షం …
Read More »‘కోహ్లి మెషీన్ కాదు.. మనిషి’
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలం కావడంపై వస్తున్న విమర్శలపై అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించారు. కోహ్లిని ఒక మనిషిలాగా చూడాలని, అతను మెషీన్ కాదని ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు. ఏఎన్‌ఐతో మాట్లాడిన రాజ్‌కుమార్ శర్మ.. ‘ఫెయిల్యూర్, సక్సెస్ అనేది స్పోర్ట్స్‌మన్ లైఫ్‌లో ఒక భాగం. మంచి రోజులు ఉన్నట్లే చెడ్డ రోజులు కూడా ఉంటాయి. కోహ్లి …
Read More »రాహుల్ దూకుడు
అద్భుత ఆల్‌రౌండ్ షోతో అలరించిన కింగ్స్ లెవన్ పంజాబ్ బోణీ చేసింది. ముందుగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 నాటౌట్) అజేయ శతకంతో భారీ స్కోరుకు బాటలు వేయగా.. ఆ తర్వాత స్పిన్నర్లు ఎం.అశ్విన్ (3/21), రవి బిష్ణోయ్ (3/32) సుడులు తిరిగే బంతులకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోలుకోలేకపోయింది. ఫలితంగా పంజాబ్ ఏకంగా 97 పరుగుల తేడాతో ఘనవిజయం సా …
Read More »ఐపీల్ లో డ్రగ్స్ కలవరం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణంపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో నటి షెర్లిన్ చోప్రా సంచలన విషయం వెల్లడించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల తర్వాత జరిగే పార్టీల్లో డ్రగ్స్ ఉపయోగించేవారని తెలిపింది. ఓసారి ఈ దృశ్యాని తాను చూశానని పేర్కొంది. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘గతం లో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తర్వాత జరిగిన పార్టీకి హాజరయ్యా. ప్రముఖ క్రికెటర్లు, వారి భార్యలు …
Read More »అంతర్జాతీయ క్రికెట్‌కు ఉమర్ గుల్ గుడ్‌బై
పాకిస్థాన్ వెటరన్ పేసర్ ఉమర్ గుల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు 36 ఏళ్ల గుల్ ప్రకటించాడు. రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. త్వరలో జరగనున్న జాతీయ టీ20 కప్.. ఆటగాడిగా అతడికి ఆఖరిది. 2003లో జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఉమర్.. అదే ఏడాది టెస్ట్ జ ట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. 2016లో ఇంగ్లండ్‌పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. …
Read More »రో”హిట్” మ్యాన్ షో
ముంబాయి ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ (54 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 80) అర్ధ శతకంతో విరుచుకుపడడంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముంబై 49 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195/5 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 47) రాణించాడు. యువ పేసర్ శివమ్ …
Read More »