టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను రోహితక్కు అప్పగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విరాట్ కోహ్లి త్వరలో స్వయంగా ప్రకటన చేస్తాడని చెప్పాయి. తన బ్యాటింగ్పై దృష్టి సారించేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read More »భారత్ – ఇంగ్లండ్ చివరి టెస్టు వాయిదా
భారత్ – ఇంగ్లండ్ చివరి టెస్టు వాయిదా పడింది. టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. భారత క్రికెట్ జట్టు శిక్షణ సిబ్బందికి కరోనా సోకడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాకే మ్యాచ్‌పై నిర్ణయం తీసుకుంటామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
Read More »‘ఫ్రెండ్ షిప్’ ట్రైలర్ విడుదల
తన స్పిన్ మాయాజాలంతో ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా రూపొందుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా, సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జాన్ పాల్ రాజ్ – శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ సినిమాగా …
Read More »టీమ్‌ఇండియా మరో అద్భుత విజయం
పనైపోయిందన్న ప్రతీసారి తిరిగి పుంజుకుని సత్తాచాటడాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్‌ఇండియా మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లార్డ్స్‌లో అద్వితీయ విజయం తర్వాత.. లీడ్స్‌లో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన భారత జట్టు.. ఓవల్‌లో గోడకు కొట్టిన బంతిలా విజృంభించింది. బ్యాట్స్‌మెన్ ప్రతాపానికి.. బౌలర్ల సహకారం తోడవడంతో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో …
Read More »భారత బ్యాటింగ్ తీరు మారలేదు
మూడో టెస్టులో ఘోర పరాజయం ఎదురైనా భారత బ్యాటింగ్ తీరు మారలేదు. లోపాలను సరిదిద్దుకోలేని స్థితిలో బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడకపోయుంటే జట్టు కనీసం 150 పరుగులైనా చేసేది కాదు. ఉమేశ్ (10)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అతడు జత చేసిన 63 పరుగులే జట్టు ఇన్నింగ్స్‌లో అత్యధికం. అయితే భారత …
Read More »76 పరుగుల తేడాతో భారత్ ఓటమి
లార్డ్స్ టెస్టు పరాభవానికి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు గట్టిగానే బదులు తీర్చుకుంది. భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో ఐదు సెషన్‌లుండగానే గెలుపు రుచి చూసిన ఇంగ్లండ్.. ఐదు టెస్టుల సిరీ్‌సలో 1-1తో నిలిచింది. నాలుగో టెస్టు వచ్చే నెల 2 నుంచి ఓవల్ మైదానంలో జరుగుతుంది. పేసర్లు ఒలీ రాబిన్సన్ (5/65), ఒవర్టన్ (3/47) భారత్ పతనాన్ని శాసించారు. దీంతో …
Read More »క్రిస్టియానో రొనాల్డో కి ఏడాదికి రూ. 253 కోట్లు
పోర్చుగీసు సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు తిరిగి వెళ్లాడు. ఇప్పటి దాకా యువెంటస్ తరఫున ఆడిన రొనాల్డోకు ఇకనుంచి ఏడాదికి రూ. 253 కోట్లు (వారానికి రూ. 4.85 కోట్లు) చెల్లించేలా మాంచెస్టర్ క్లబ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రొనాల్డో మాంచెస్టర్ తరఫున అత్యధిక పారితోషికం అందుకోనున్న ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ క్లబ్ తరఫున అత్యధికంగా డేవిడ్ డి గియా ఏడాదికి రూ. 197 …
Read More »తెలుపు చీరలో సింధు తళతళ
బ్యాడ్మింటన్ కోర్టులో స్మాష్ షాట్లతో అలరించే పీవీ సింధు ( PV Sindhu ).. ఇప్పుడు సాంప్రదాయ దుస్తుల్లోనూ ఆకట్టుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన హైదరాబాదీ షట్లర్.. తన జెర్సీలను పక్కనపెట్టేసి కొత్త లుక్‌లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన తెలుపు చీరలో సింధు తళతళ మెరిసిపోతోంది. పింక్, బ్లూ, పర్పుల్ త్రెడ్‌వర్క్ ఉన్న ఆ చీరలో .. చాలా సహజమైన అందంతో …
Read More »నా దేశాన్ని రక్షించండి -స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం సాధారణ ప్రజలను బలి తీసుకుంటోంది. తమ దేశం రావణకాష్టంగా మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. తమను ఇలా గందరగోళంలో వదిలేయకండి అని ప్రపంచ నేతలను వేడుకుంటున్నాడు. బుధవారం అతడు …
Read More »భారత హాకీ జట్టు గెలుపుపై సీఎం కేసీఆర్ హర్షం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత దేశ క్రీడాకారులు హాకీ, బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 41 ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ విజయంతో భారతదేశపు ప్రముఖ క్రీడ హాకీ విశ్వ వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ …
Read More »