ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ప్రస్తుతం దుబాయ్ ఐపీఎల్ ఆడుతున్న అలీ.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే అంతకాలం ఇంటికి దూరంగా ఉండలేనని భావించిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున 64 టెస్టులు, 112 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.
Read More »జిమ్ డ్రెస్సులో సారా టెండూల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోను అప్‌లోడ్ చేసింది. జిమ్ డ్రెస్సులో ఉన్న ఫోటోను పోస్టు చేసిన సారా టెండూల్కర్ తానెందుకు ఆ డ్రెస్సు వేసుకోవాల్సి వచ్చిందో తెలిపింది. తన ఫ్రెండ్ ఓ కొత్త క్రీడా దుస్తుల షాపును ఓపెన్ చేసిందని, దానిలో భాగంగానే ఆ డ్రెస్సు వేసుకున్నట్లు సారా తన పోస్టులో చెప్పింది. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, …
Read More »క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త
దేశవాళీ టోర్నీల్లో ఆడే క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. 40 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడిన సీనియర్ ఆటగాళ్లకు రూ.60వేలు, అండర్-23 ప్లేయర్లకు రూ.25వేలు, అండర్-19 ఆటగాళ్లకు రూ. 20వేల మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే కరోనా కారణంగా గత సీజనక్కు గానూ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50శాతం పరిహారం కింద ఇస్తున్నట్లు చెప్పారు.
Read More »RCB పై KKR ఘనవిజయం
రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ,కోలకత్తా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ క ఘన విజయం సాధించింది. 93 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే 9వికెట్ల తేడాతో ఛేదించింది. కోల్ కత్తా జట్టులో శుభ్మన్ గిల్ 48(34బంతులు), వెంకటేశ్ అయ్యర్ 41 (27 బంతులు) రాణించారు. ఆఖర్లో గిలు ఔట్ చేసినా కేకేఆర్ విజయాన్ని కోహ్లి సేన అడ్డుకోలేకపోయింది. బెంగళూరు బౌలర్ చాహల్క ఒక …
Read More »PAK కి షాకిచ్చిన England
పాకిస్థానుకు మరో దెబ్బ తగిలింది. భద్రతా సమస్యల కారణంగా న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సిరీసన్ను రద్దు చేసుకొని పాక్ నుంచి వెళ్లిపోయింది. కాగా.. తాజాగా ఇంగ్లాండ్ కూడా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘మా నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దానికి చింతిస్తున్నాం’ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. మహిళా పర్యటన కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Read More »ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఝలక్
డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఝలక్ ఇచ్చింది. IPL-2021 రెండో విడత తొలి మ్యాచ్ ధోనీ సేన 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. 157 పరుగుల లక్ష్య ఛేదనలో 136/8 రన్స్ మాత్రమే చేశారు. తివారీ (50*) ఒక్కడే రాణించాడు. బ్రావో 3, దీపక్ చాహర్ 2, హేజిల్వుడ్, ఠాకూర్ ఒక్కో …
Read More »జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎస్ శరత్
తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల కమిటీకి శరత్ (సౌత్ జోన్) చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. కిషన్ మోమన్ (నార్త్ జోన్), రణదేవ్ బోస్ (ఈస్ట్ జోన్), పతీక్ పటేల్ (వెస్ట్ జోన్), హర్విందర్‌సింగ్ సోధి (సెంట్రల్) ఒక్కో జోన్ నుంచి …
Read More »టీమిండియా తర్వాత కోచ్ అనిల్ కుంబ్లే
T20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని రవిశాస్త్రి మరోసారి స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని అనిల్ కుంబ్లేను BCCI సంప్రదించిందట. గతంలో కుంబ్లే కోచ్గా పనిచేశాడు. కోహ్లితో విభేదాల కారణంగా తప్పుకున్నాడు. ప్రస్తుతం IPLలో PBKS కోచ్ ఉన్నాడు. కుంబ్లే తో పాటు కోచ్గా లక్ష్మణ్ను సంప్రదించిందట. బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ గురించి BCCI ఆలోచన చేస్తోందట.
Read More »రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో భారత జట్టు T20 కెప్టెన్సీ అందుకోవడానికి రోహిత్ శర్మ అర్హుడని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ చెప్పారు. ‘కోహ్లి కెప్టెన్గా వైదొలగడం ఊహించిందే. రోహిత్క నాయకత్వం వహించే అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు ఆకట్టుకున్నాడు. అంచనాలను అందుకున్నాడు. 2018లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆసియాకప్ గెలిచింది. IPLలో ముంబై ఇండియన్స్ను గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు’ అని దిలీప్ అన్నారు.
Read More »అంతర్జాతీయ క్రికెట్ కి బ్రెండన్ టేలర్ గుడ్ బై
జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2004లో అరంగేట్రం చేసిన బ్రెండన్ టేలర్.. ఆ తర్వాత జింబాబ్వే స్టార్ బ్యాట్స్మన్గా ఎదిగాడు. తన కెరీర్లో 34 టెస్టులు, 204 వన్డేలు, 45 టీ 20లు ఆడాడు. వన్డేల్లో జింబాబ్వే తరపున 6,677 పరుగులు చేశాడు. జింబాబ్వే తరపున ఇదే రెండో అత్యధికం.
Read More »