ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించిన సంగతి విదితమే.. ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రాపై ప్రసంశలు వస్తున్నాయి. ‘కోచ్ మనసు పెట్టి పనిచేశాడు. తన ఆటగాళ్ల గురించి, వాళ్లకు ఏ విధంగా సాయం చేయాలనే దాని గురించి తెగ ఆలోచిస్తుంటాడు. వ్యూహాల పరంగా IPLలో అత్యుత్తమ కోచ్లలో అతడు ఒకడు. ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చేసేలా వాళ్లతో మాట్లాడుతుంటాడు. ప్రచారం కోరుకోడు. తెరవెనుక ఉంటాడు’ అని GT …
Read More »క్రికెట్ చరిత్రలోనే రికార్డు
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో నేపాల్ జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. యూఏఈతో జరిగిన పోరులో నేపాల్ 8 పరుగులకే ఆలౌటై అందరిని విస్మయపరిచింది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న ప్రపంచకప్ కోసం నేపాల్, థాయ్‌లాండ్, భూటాన్, యూఏఈ, ఖతార్ మధ్య క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా శనివారం యూఏఈతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 8.1 ఓవర్లలో 8 పరుగులకు ఆలౌటైంది. …
Read More »గంగూలీ పొలిటికల్ ఎంట్రీ? ట్వీట్ చేసిన బీసీసీఐ చీఫ్!
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. లేటెస్ట్‌గా ఆయన చేసిన ట్వీట్ దీనికి మరింత బలం చేకూరుస్తోంది. క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు గడిచాయని.. ఇప్పుడు కొత్త మార్గంలో నడవాలని భావిస్తున్నట్లు ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను గంగూలీ పోస్ట్ చేశారు. ఎప్పటినుంచో గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై …
Read More »కోహ్లీ రికార్డును సమం చేసిన బట్లర్
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఫుల్ జోష్ మీదున్నాడు. బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్న ఆ హిట్టర్ ఇప్పుడో రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును అతను సమం చేశాడు. ఈ యేటి సిరీస్‌లో బట్లర్ నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ బట్లర్ సూపర్ షో కనబరిచాడు. మోదీ స్టేడియంలో పరుగుల …
Read More »శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా ధావన్ ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్‌లో ధావన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధావన్ పేరిట ఐపీఎల్‌లో ఇప్పుడు మొత్తం 701 ఫోర్లు ఉన్నాయి. అతని …
Read More »రూ.40 కోట్లతో బంగ్లా కొన్న గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడు,టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ కోల్ కత్తాలో భారీ బంగ్లాను కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 10,280 చదరపు అడుగులు కలిగిన ఈ బంగ్లాను భార్య డోనా, కూతురు సనా, తల్లి నిరూపమ్ పేరిట సమానంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. 48 ఏళ్ల తర్వాత పూర్వీకుల ఇంటి నుంచి గంగూలీ త్వరలోనే కొత్తగా కొన్న భవనంలోకి మారనున్నాడు.
Read More »పబ్ లో దుమ్ము లేపిన రవిశాస్త్రి
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి దుమ్మురేపుతున్నాడు. ఓ కలర్‌ఫుల్ డ్రెస్సులో వెరైటీగా దర్శనమిస్తున్నాడు. మెరుపుల జాకెట్ వేసుకున్న రవిశాస్త్రి తన కొత్త ఫోటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పబ్‌లో స్వాగ్ తరహా పిక్స్‌తో నెటిజెన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాడు. ‘Good mornings’ are optional if you haven’t slept at all. pic.twitter.com/4OhSYEg3Ln — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 బ్లూ షైనింగ్ జాకెట్.. డిస్కో కళ్ల …
Read More »వరల్డ్ బాక్సింగ్‌లో తెలంగాణ అమ్మాయికి గోల్డ్ మెడల్
యువ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌తో జరిగిన ఫైనల్‌లో 5-0తో ఆమె జయకేతనం ఎగురవేసింది. గేమ్‌లో తొలి నుంచి దూకుడుగా ఉన్న ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా అదరగొట్టేసింది. నిఖత్ జరీన్ గెలుపుతో హైదరాబాద్‌లోని …
Read More »ఎంఎస్ ధోనీపై అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను టీమిండియా మాజీ కెప్టెన్.. సీనియర్ మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ మళ్లీ తీసుకోవడంపై మాజీ క్రికెటర్.. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించాడు. ధోనీ ఏ జట్టులో ఆడినా.. ఆ జట్టుకు కెప్టెన్ గా ఉండాలని అజారుద్దీన్ అభిప్రాయడ్డాడు. చెన్నై జట్టు తీసుకున్న ఈ జడేజా ఆటతీరు కూడా మెరుగుపడుతుందని ఈ టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం పేర్కొన్నాడు.
Read More »అఫ్రిదీపై డానీష్ కనేరియా సంచలన ఆరోపణలు
పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానీష్ కనేరియా షాహిద్ అఫ్రిదీపై సంచలన ఆరోపణలు చేశాడు. ‘హిందువు అయినందుకు నేను జట్టులో ఉండటం అతడికి ఇష్టం ఉండేది కాదు. నన్నెప్పుడూ కించపరిచేవాడు. ఇతర టీమ్ సభ్యులను రెచ్చగొట్టి నాపైకి ఉసిగొల్పేవాడు. నేను బాగా ఆడితే తట్టులేకపోయేవాడు. అతడొక క్యారెక్టర్ లేని వ్యక్తి’ అని కనేరియా మండిపడ్డాడు. వీరిద్దరూ కలిసి పాక్ జట్టు తరఫున ఆడారు.
Read More »