* మేడిగడ్డ బ్యారేజ్ తరహాలోనే అన్నారం బ్యారేజ్ కూడా కుంగిపోతోందని, నీటిని నిల్వ చేయని విధంగా దెబ్బతింటోందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం శాసనసభలో నీటి పారుదల రంగంపై శ్వేత పత్రం విడుదల చేస్తూ ప్రకటించారు. * ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు ఉపయోగపడదని నేషనల్ డ్యాం సేఫ్టీ కమిటీ తేల్చి చెప్పిందని, అన్నారం బ్యారేజ్ నుంచి కూడా అదే విధంగా లీకేజీలు మొదలయ్యాయని …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది DSP, ఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు చేశారు.ఈ బదిలీల్లో భాగంగా యాదాద్రి డిఎస్పీగా రమేష్ కుమార్, నల్గొండ SPDOగా శివరాంరెడ్డి, కోదాడ SPDOగా శ్రీధర్ రెడ్డి, ఆదిలాబాద్ డిఎస్పీగా ప్రకాష్, మాదాపూర్ ACP Y.శ్రీనివాస్ కుమార్ నియమితులయ్యారు.
Read More »మేడిగడ్డ వ్యయం 4 వేల కోట్లకు చేరటం పై కాగ్ ఏమి చెప్పింది
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనది మేడిగడ్డ బ్యారేజి. ఈ బేరేజి నిర్మాణం ఖర్చు మొదట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా మధ్యలో పనులలో మళ్ళీ సర్దుబాట్లు చేయటం వల్ల 2472 కోట్లు అదనపు భారం ప్రభుత్వం మీద పడింది. ఆగస్టు 2016న తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం ఒక కాంట్రాక్టర్ కు అప్పగించింది. ఒప్పందం విలువ రూ 1849.31 కోట్లు. ఈ ఒప్పందం ప్రకారం బ్యారేజి నిర్మాణం 24 నెలల్లో …
Read More »తెలంగాణలో కరోనా జేఎన్.1 తొలి మరణం
తెలంగాణలో ఈ ఏడాది కరోనాతో తొలి మరణం సంభవించింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. కరోనా టెస్టులు చేశారు. అతడికి పాజిటివ్ నిర్ధరణ అయింది. అటు ఏపీలోని విశాఖలోనూ కరోనా మరణం సంభవించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మూడు మరణాలు సంభవించాయి.
Read More »రకుల్‌ప్రీత్‌సింగ్ కి శాంటా ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా..?
క్రిస్మస్ రోజునే తన ప్రియుడు జాకీ భగ్నానీ పుట్టినరోజు కూడా కావడంతో తన ప్రియబాంధవుడికి తన సోషల్‌మీడియా ద్వారా అక్షరాలతో ప్రేమను కురిపించేసింది రకుల్ ప్రీత్.ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా ముద్దు ముద్దు సమాధానాలిచ్చేసింది. ‘మా ప్రేమకు రెండేళ్లు. క్రిస్మస్‌రోజునే తను పుట్టాడు. ఇదేరోజు సరిగ్గా రెండేళ్ల క్రితం మాలో ప్రేమ చిగురించింది. అందుకే ఇది మాకు స్పెషల్‌డే.’ అని చెప్పింది రకుల్.‘శాంటా నాకిచ్చిన బహుమతి నువ్వు. …
Read More »అంగన్ వాడీలతో చర్చలకు జగన్ ప్రభుత్వం పిలుపు
ఏపీలో తమ జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే అంగన్ వాడీలతో చర్చలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో అంగన్‌వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది. ఒకవైపు వేతనాల పెంపుపై అంగన్‌వాడీలు పట్టుపడుతుంటే.. వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని …
Read More »ప్రజా భవన్‌లో మొదలైన ప్రజావాణి కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అధికారక భవనం అయిన ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు …
Read More »డిప్యూటీ సీఎం భట్టిని గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంధ్రభారతిలో ఈ నెల 30న నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లను ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు కలిసి ఆటా గ్రాండ్ ఫినాలేకు …
Read More »నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ మందులు వాడోద్దు
నాలుగేళ్లలోపు పిల్లలకు క్లోరోఫెనిరామైన్ మాలేట్, ఫెనైల్ట్ఫిన్ కాంబినేషన్లోని యాంటీ కోల్డ్ డ్రగ్స్ ఇవ్వడాన్ని కేంద్రం నిషేధించింది. దగ్గుమందుల వాడకంతో గతేడాది నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినారెస్ట్ టాబ్లెట్, మక్స్డ్ సిరప్, నాసోక్లియర్ కోల్డ్-AF డ్రాప్స్ మొదలైనవి ఈ నిషేధిత కాంబినేషను చెందినవే.
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా కలవరం మొదలైన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. * మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. * 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దు. * వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవాలి. * జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బందులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. * ఇంటి లోపల వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
Read More »