ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. శుక్రవారం నుంచి మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. 16న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, 18న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీంతో రాజ్యసభ సభ్యులుగా ఎవరు ఎన్నికవుతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Read More »ఆ విషయంలో చంద్రబాబు చెప్పినా ఎవరూ వినట్లేదట.. ఓటమి భయమే!
ప్రజా చైతన్యయాత్ర పేరుతో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు సభలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో జిల్లాలవారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఎక్కడైనా గెలిచే అవకాశం ఉందా అనే పరిస్థితలపై ఆరా తీస్తున్నారు. స్థానిక నేతలతో చర్చించి నియోజకవర్గ ఇంఛార్జ్ లను నియమించే పనిలో పడ్డారు. కానీ …
Read More »అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో కోర్టుకు హజరైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ
జగ్గయ్యపేటకు చెందిన నమస్తే పేపర్ ఎడిటర్ సైదేశ్వరరావు దాదాపేగా నాలుగు సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సివిల్ కోర్టులో పరువునష్టం దావావేసారు. ఈక్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ను అనేకమార్లు న్యాయస్థానానికి హాజరుకావాలని కోరినా ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అరెస్ట్ వారెంట్ సమన్లు జారీచేయడంతో రాధాకృష్ణ శుక్రవారం జగ్గయ్యపేట కోర్టుకు హజరయ్యారు.
Read More »పేదలకు సర్వ హంగులతో ఇళ్లు కట్టించనున్న ఏపీ సర్కార్
పేదలకు వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 30 లక్షల ఇళ్ల డిజైన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. బెడ్‌రూం, కిచెన్,పెద్ద హాలు, వరండా, టాయిలెట్ సదుపాయాలతో ఇళ్లను నిర్మించడానికి సమాయత్తం అమవుతోంది. గృహనిర్మాణంపై సమీక్ష సందర్భంగా పేదలకు కట్టించనున్న ఇంటి డిజైన్‌పై ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. తాము రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్లునాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇంటి డిజైన్‌లో …
Read More »స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదల..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను శనివారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ విడుదల చేసారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని..జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇక ఎన్నికల నియమావాలని ఎవరైనా ఉల్లంగిస్తే ఎంతటివారైనా తక్షణమే శిక్షిస్తామని అన్నారు. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే..! జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వివరాలు: …
Read More »సకాలంలో స్పందించిన సుబ్బారెడ్డి..లేదంటే మొత్తం లూటీనే !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వైయిఎస్(YES) బ్యాంకును అడ్డంపెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు.1300 కోట్ల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కుతీసుకోవడంతో ప్రమాదం తప్పింది ఆయన అన్నారు. Yes Bankకు AP టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు.ఇంకెన్ని …
Read More »స్థానిక ఎన్నికల విషయంలో సిగ్గు, శరం వదిలేసిన చంద్రబాబు !
ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కుళ్ళు రాజకీయం చేస్తున్నాడు. బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్నతీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు హైకోర్ట్ లో కేసు వేయించిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారి చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మల్లా మరోకొత్త ప్లాన్ కు సిద్దమయ్యారు …
Read More »కడపలో స్టీల్ ప్లాంట్..పెట్టుబడులతో ఐఎంఆర్!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయం నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. అవి గమనిస్తున్న ప్రజలు రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని అంటున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయకత్వంలో వారి సొంత మనుషులే బాగుపడ్డారు తప్ప వేరెవ్వరికి న్యాయం జరగలేదు. ప్రస్తుతం జిల్లా, మండలం, ఊరు అని కాకుండా అన్ని చోట్ల జగన్ మంచితనంతో ముద్ర వేసుకున్నాడు. ఇక తాజాగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో …
Read More »‘నారా వైరస్’ కు వ్యాక్సిన్..10నెలల ముందే తరిమికొట్టారు !
వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు.’‘నారా వైరస్’ కరోనా కంటే భయంకరమైనది. కరోనాకు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రజలు మాత్రం నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు. ఆ వ్యాక్సిన్ తోనే పది నెలల క్రితం వైరస్‌ను తరిమికొట్టారు. మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు, కుల మీడియా కిందా మీదా …
Read More »చంద్రబాబుకు భారీ షాక్.. సన్నిహితుడి ఇంట్లో సోదాలు!
చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు, ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయాలపై తాజాగా ఐటీదాడులు జరిగాయి. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఎల్‌వీపీఎల్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కలకలం రేపిన అమరావతి …
Read More »