విజయవాడ: బడ్జెట్పై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బాల వీరాంజనేయ స్వామిపై సస్పెన్షన్ వేటు వేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ సభ్యుల సస్పెన్షన్‌పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఐదుగురు టీడీపీ సభ్యులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. …
Read More »తెలంగాణలో ‘కారు’స్పీడ్‌లో ఉంది.. యూపీ ఫలితాలు ఇక్కడ రావు: అసదుద్దీన్
హైదరాబాద్: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు తనను సర్‌ప్రైజ్ చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో అసద్ మాట్లాడారు. యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్‌యాదవ్ మరింత ముందుగానే రెడీ అవ్వాల్సిందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని.. ‘కారు’ స్పీడ్‌లో ఉందని …
Read More »మీకు అంతలేదు.. పగటికలలు మానండి: బీజేపీకి మమత సెటైర్
కోల్‌కతా: గురువారం వెల్లడైన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాలుగుచోట్ల బీజేపీ, ఒక చోట ఆప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందడంపై బీజేపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రధాని మోదీ సహా పలువురు నేతలు ఈ ఎన్నికల విజయం 2024 లోక్‌సభ తీర్పును రిఫ్లెక్ట్ చేస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగు …
Read More »కేబినెట్‌లో చోటు దక్కకపోతే.. రీషఫిల్‌పై సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విజయవాడ: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ (రీషఫిల్)పై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు ఉదయం శాసనసభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే ముందు మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేబినెట్ రీషఫిల్‌పై సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో స్థానం కోసం చాలా …
Read More »కాంగ్రెస్‌లో భట్టిది నడుస్తలేదు.. అక్కడ గట్టి అక్రమార్కులున్నారు: కేటీఆర్
హైదరాబాద్: శాసనసభలో మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తన ప్రసంగంలో కేటీఆర్ ప్రస్తావించారు. దీనిపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. ఏమైందంటే.. బడ్జెట్‌పై చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అంశంపై రేవంత్‌రెడ్డి స్పందించిన తీరుపై వ్యాఖ్యలు చేశారు. సభలో పోడియం వద్దకు వచ్చి …
Read More »అయ్యో కాంగ్రెస్.. మరీ ఇంత ఘోర ఓటమా?
దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమిని మిగిల్చాయి. ఎంతో చరిత్ర కలిగిన హస్తం పార్టీ.. కొత్తగా ఎక్కడా అధికారంలోకి రాకపోగా ఉన్న పంజాబ్‌లోనూ అధికారాన్ని కోల్పోయింది. జాతీయ పార్టీ అయినప్పటికీ నాయకత్వ లేమి, పార్టీలో ఉన్న గ్రూపులు, అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌కు ఈ దీనస్థితిని తీసుకొచ్చాయి. యూపీలో ఆ పార్టీ ఏమాత్రం పుంజుకోలేకపోయింది. కేవలం రెండుస్థానాలకే పరిమితమైంది. పంజాబ్‌లో ఆప్‌తో హోరాహోరీ ఉంటుందని భావించినా అలాంటిదేమీ …
Read More »పంజాబ్‌లో దుమ్ములేపిన ఆప్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవే..
దిల్లీ: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. యూపీ, పంజాబ్ ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఈరోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎగ్జిట్‌పోల్ అంచనాలను దాదాపుగా నిజం చేస్తూ ఫలితాలు వచ్చాయి. యూపీలో తొలి నుంచే అధికార బీజేపీ ఆధిక్యం కొనసాగింది. ఉత్తరాఖండ్, మణిపూర్‌లోనూ కాషాయ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. రాజకీయ విశ్లేషకులు ఊహించిన విధంగానే పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. …
Read More »దేశాన్ని బాగుచేయడం కేసీఆర్ వల్లే అవుతుంది: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా బీజేపీ తీసుకురాలేదని ఆరోపించారు. మతకలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏడేళ్లలో …
Read More »నిరుద్యోగులంతా రేపు ఉదయం టీవీ చూడాలి: కేసీఆర్
వనపర్తి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యమ జెండా పరిపాలనలో ఉంటేనే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని.. అందుకే టీఆరెస్ కు రెండు సార్లు అధికారం ఇచ్చారని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తిలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. రేపు ఉదయం నిరుద్యోగులంతా టీవీ చూడాలని.. 10 గంటలకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని …
Read More »ఇంట్రెస్టింగ్‌గా ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్..ఎక్కడ ఏ పార్టీ?
దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం ముగిసింది. నేటితో చివరి దశ పోలింగ్ పూర్తయింది. మార్చి 10న ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. పిబ్రవరి 10న ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు నేటితో ముగిశాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రకటించాయి. మ్యాట్రిజ్,పీమార్క్, టైమ్స్ నౌ-వీటో,పోల్‌స్ట్రాట్, ఆత్మసాక్షి, సీఎన్ఎన్-న్యూస్ 18, జన్‌కీ బాత్-ఇండియా న్యూస్ తదితర సంస్థలు …
Read More »