Home / POLITICS (page 77)

POLITICS

కాంగ్రెస్‌లో ప్రకంపనలు.. 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లపై సోనియా వేటు

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశించింది. పంజాబ్‌ పీసీసీ చీఫ్ సిద్దూ సహా మిగతా నాలుగు రాష్ట్రాల అధ్యక్షులు రాజీనామాలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ …

Read More »

ఆ విద్యార్థుల మెడిసిన్‌ కోర్సు ఖర్చు మేమే భరిస్తాం: కేసీఆర్‌

హైదరాబాద్‌: ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చేసిన విద్యార్థులు మళ్లీ ఉక్రెయిన్‌ వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. మెడిసిన్‌ విద్య మధ్యలో ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ విద్యార్థులకు కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. మెడిసిన్‌ పూర్తి చేసేందుకు  ఆ …

Read More »

ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ప్‌ ఉద్యోగులకు కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌: ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ప్‌ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ఇకపై సమ్మె చేయడంలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు.  మరోవైపు సెర్ప్‌ ఉద్యోగులకు  ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు …

Read More »

జరగనిది జరిగినట్లు టీడీపీ విషప్రచారం: జగన్‌

విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 55వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో ఎవరైనా సారా తయారీ చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు పదేపదే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతూ గందరగోళం సృష్టిస్తుండటంతో  సీఎం మాట్లాడారు. సారా తయారీ దారులపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో అంటే నమ్మడానికి అర్థముంటుందని.. వార్డు సచివాలయాలు, పోలీస్‌స్టేషన్‌, మున్సిపల్‌ …

Read More »

పొత్తులపై పవన్‌ క్లారిటీ.. 2014 సీన్‌ రిపీట్‌ అవుద్దా?

మంగళగిరి: వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేనదే అధికారమని.. సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని చెప్పారు. పార్టీలు వ్యక్తిగత లాభాలను వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చినపుడు ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తామని క్లారిటీగా చెప్పారు. ఈ విషయంలో బీజేపీ నేతలు రోడ్‌మ్యాప్‌ ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి …

Read More »

నేచురల్‌ డెత్స్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం: సీఎం జగన్‌

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన నేచురల్‌ డెత్స్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. కల్తీమద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్‌షాపులను పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేకసార్లు జరిగాయని చెప్పారు. గతంలో లాభాల కోసం బడి, …

Read More »

60 ఏళ్లలో 3.. ఈ ఆరున్నరేళ్లలో 33 మెడికల్‌ కాలేజీలు: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌: ఇతర దేశాలకు వెళ్లి మెడిసిన్‌ చదివే అవసరం లేకుండా రాష్ట్రంలోనే మెడికల్‌ కాలేజీల సంఖ్యను పెంచామని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శాసనసభ క్వశ్చన్‌ అవర్‌లో హరీష్‌రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించపోయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఉమ్మడి పరిపాలనలో ఉన్నప్పుడు ఏపీలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఆ అవకాశమే ఉండేది కాదని చెప్పారు. ఇదే సభలో అనేక …

Read More »

గౌతమ్‌రెడ్డి శాఖలు బుగ్గనకు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ

విజయవాడ: గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శాఖలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి గౌతమ్‌రెడ్డి శాఖలు అప్పగించారు. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, పెట్టుబడులు-మౌలిక వసతులు, టెక్స్‌టైల్స్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలను బుగ్గనకు కేటాయిస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం ఏడు శాఖలు బుగ్గన పరిధిలోకి వచ్చినట్లయింది. ఇప్పటికే బుగ్గన …

Read More »

రేవంత్‌కు మళ్లీ మల్కాజ్‌గిరిలో గెలిచే సత్తా ఉందా?: గువ్వల బాలరాజు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, టీడీపీతో పాలమూరుకు ఏం మేలు జరిగిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కొల్లాపూర్‌ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని చెప్పారు.  టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవిని వ్యాపారాల కోసం రేవంత్‌ వాడుకుంటున్నారని ఆరోపించారు. భయం వల్లే కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం లేదన్నారు. …

Read More »

అత్యున్నత పదవుల్లో రైతుబిడ్డలు ఉండటం ప్రజల అదృష్టం: కేటీఆర్‌

హైదరాబాద్‌: శాసన మండలి ఛైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  మండలి ఛైర్మన్‌ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్‌ హసన్‌ జాఫ్రి ప్రకటించారు. గుత్తా మండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. ఎన్నికైనట్లు ప్రకటించిన అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డిని మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు ఛైర్మన్‌ స్థానం వద్దకు తీసుకెళ్లారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat