ఏలూరు జిల్లాలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం అందజేయనుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున పరిహారం అందిస్తామని మంత్రి తానేటి వనిత చెప్పారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా హాస్పిటల్‌లో మంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోరస్‌ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చాలా బాధాకరమని.. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని.. అవసరమైతే ఫ్యాక్టరీని …
Read More »అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్ పాలన
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వల్లే దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కలిగిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్పీకర్ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు …
Read More »మంత్రి రోజాకు దిష్టితీసిన భర్త సెల్వమణి
వైకాపా జెండా పట్టుకుని నడిచిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రంలోని కుల సమీకరణాల ఆధారంగా కేటాయింపులు చేశారని చెప్పారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రోజాకు ఆమె భర్త సెల్వమణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ …
Read More »గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో బూస్టర్‌కి పర్మిషన్ ఇవ్వండి: హరీశ్‌రావు
రాష్ట్రంలోని గవర్నమెంట్ హాస్పిటళ్లలోనూ కొవిడ్‌బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. ఇటీవల 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనే బూస్టర్ డోసుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని మన్‌సుఖ్ మాండవీయను హరీశ్‌రావు కోరారు. …
Read More »నేనెప్పుడూ జగన్‌కు విధేయురాలినే: సుచరిత
ఇటీవల మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఏపీ హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. కేబినెట్‌లో చోటు కల్పించలేకపోవడానికి గల కారణాలను సీఎం వివరించడంతో ఆమె మెత్తబడ్డారు. అనంతరం మీడియాతో సుచరిత మాట్లాడారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. జడ్పీటీసీ నుంచి హోంమంత్రిగా ఎదిగేందుకు జగన్ అవకాశం కల్పించారన్నారు. రెండున్నరేళ్ల తర్వాత కొంతమందిని మారుస్తానని సీఎం ముందే చెప్పారని.. …
Read More »యాసంగి ధాన్యం ప్రతి గింజా మేమే కొంటాం: కేసీఆర్
ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రానంత మాత్రాన తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. యాసంగిలో ప్రతి గింజా తామే కొంటామని చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,960 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు …
Read More »అయ్యో దిగ్విజయ్.. ఆ ఫొటో పెట్టి దొరికేశావా!
తరచూ తన కామెంట్లతో వివాదాస్పదమయ్యే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఈసారి ఫేక్ ఫొటోను ట్విటర్‌ల పోస్ట్ చేసి వివాదాస్పదమయ్యారు. ఈరోజు ఉదయం దిగ్విజయ్ తన ట్విటర్ అకౌంట్ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ‘ఆదివారం ఖర్గోవ్‌లో జరిగిన మతపరమైన హింస సమయంలో తీసిన ఫొటో’ అంటూ దానికి క్యాప్షన్ పెట్టారు. మసీదుపై కొంతమంది యువకులు కాషాయ జెండా పెడుతున్నట్లుగా ఉన్న ఆ …
Read More »జగన్ ఎవరికీ అన్యాయం చేయరు: పిన్నెల్లి
సీఎం జగన్‌తో తాను మొదటి నుంచి నడిచిన వ్యక్తినని.. వైసీపీ అంటే తమ పార్టీనే అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రి పదవి రాలేదని తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పిన్నెల్లి సీఎంను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సామాజిక సమీకరణల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ మంత్రి వర్గంలో భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. …
Read More »నాకెలాంటి కోపం లేదు: మాజీ మంత్రి బాలినేని
మంత్రి పదవి విషయంలో తనకెలాంటి కోపం లేదని మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి అంశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను అప్పుడే ఖండించానని చెప్పారు. జగన్ ఆలోచన మేరకే మంత్రి పదవులు వస్తాయన్నారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి తాను తొలి నుంచి విధేయుడినని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను …
Read More »మాజీ మంత్రి కొడాలి నానికి కీలక పదవి?
ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కొడాలి నానికి కీలక పదవి ఇచ్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్‌గా కొడాలి నానిని నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఆ ఛైర్మన్ పదవికి కేబినెట్ హోదా కల్పించాలనేది జగన్ ఆలోచనగా వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మరో …
Read More »