ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి తీరతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పంట ఉత్పత్తి తగ్గించే తీరుపై తిరోగమన విధాలను అవలంభిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ఏఈవోలకు నిరంతర ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ అధికారులు …
Read More »ఆవేశంలోనే అలా అనేశాను: వైసీపీ ఎమ్మెల్యే బాబూరావు
మంత్రి పదవి విషయంలో మాట్లాడిన మాటలు ఆవేశంతో అన్నవే తప్పించి తన మనసులో నుంచి రాలేదని పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఇటీవల ఏపీ కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాబూరావు మాట్లాడారు. మంత్రి పదవి విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. నియోజకవర్గ ప్రజల కోసం …
Read More »మే 1 నుంచి విద్యుత్ కొరత లేకుండా చూస్తాం: పెద్దిరెడ్డి
దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉందని.. పవర్ ఎక్స్‌ఛేంజ్‌ల్లోనూ ఇదే సమస్య ఉందని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా పవర్‌ను సప్లై చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. అందుబాటులో మాత్రం 150 మిలియన్ యూనిట్లే ఉందని చెప్పారు. వచ్చే నెల నుంచి కృష్ణపట్నం, ఎన్టీపీఎస్ ప్లాంట్ల ద్వారా మరో …
Read More »మేం వద్దంటున్నామా? దమ్ముంటే అమలు చేయండి: బీజేపీపై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వాటిని అమలు చేస్తామంటే తాము వద్దంటామా? అని ఎద్దేవా చేశారు. ఈనెల 27న టీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లపై కేటీఆర్‌సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అనంతరం …
Read More »ఈనెల 27న టీఆర్‌ఎస్ ప్లీనరీ.. ఎక్కడంటే..!
కొవిడ్ పరిస్థితులతో గత రెండేళ్లుగా నిర్వహించలేకపోయిన టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈసారి హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్ 27న మాదాపూర్ హెచ్‌ఐసీసీలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆరోజు ఉదయం 11.05 గంటలకు టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. అదేరోజు ప్లీనరీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీకి మంత్రులు, …
Read More »అనవసర కొర్రీలతో ఇబ్బందులు పెట్టొద్దు: మంత్రి గంగుల
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యాసంగి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టిందని చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అన్నారు. అవసరమైతే కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. అంతకుముందు సివిల్ …
Read More »అప్పుడు చాలా బాధపడ్డా: మంత్రి రోజా
టీడీపీలో ఉన్నప్పుడే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారని మంత్రి ఆర్కే రోజా గుర్తుచేసుకున్నారు. వైఎస్‌ఆర్‌తో కలిసి రాజకీయాల్లో పనిచేయాలని కలగన్నా.. ఆయన అకాల మరణంతో ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డానని చెప్పారు. ఆ సమయంలో ఐరన్ లెగ్ అంటూ తనను టీడీపీ వాళ్లు అవహేళన చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ తనకు దేవుడని.. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని …
Read More »మీ పాదయాత్రకు ఆ పేరు పెట్టుకోండి: బండిపై కేటీఆర్ ఫైర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి జై కొడతారా? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ పాదయాత్రలా? అని మండిపడ్డారు. బండి సంజయ్ చేస్తోందని ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని తీవ్రస్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. …
Read More »మిగతా వర్గాలకూ దళితబంధు తరహా పథకం: కేటీఆర్
దళితబంధు నిధులతో ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేసుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన దళితబంధు లబ్ధిదారులకు నిధుల మంజూరు లేఖల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే వాటి ప్రారంభోత్సవానికి తాను రానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో రాష్ట్రంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. రూపాయి పెట్టుబడి పెట్టి రూపాయిన్నర రాబడి గురించి …
Read More »అంబేద్కర్‌కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి సీఎం ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత జాతికి అంబేద్కర్ అందించిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
Read More »