టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అత్యాచార ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన తనను అడ్డుకుని దూషించారంటూ చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో చంద్రబాబుతో వచ్చిన నేతలు అడ్డుకుని గొడవకు దిగి ఉద్రిక్త పరిస్థితులు కల్పిచారని.. గౌరవ ప్రదమైన …
Read More »దేశంలో ఎవరూ చేయని పనులు కేసీఆర్ చేసి చూపించారు: కేటీఆర్
దేశంలో ఎవరూ చేయని పనులు.. దశాబ్దాలుగా ఎక్కడా జరగని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేసి చూపించారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్ అని… అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం ఇస్తున్న నాలుగో పెద్ద రాష్ట్రం తెలంగాణ అని.. ఈ …
Read More »రేవంత్ ఏ పార్టీలో ఉంటే అది నాశనమే: ఎర్రబెల్లి
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందు ఆ పార్టీ కొన్ని సీట్లు అయినా గెలిచిందని.. ఇప్పుడు జీరో అయిందని టీఆర్‌ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేసేది రేవంత్ ఒక్కడేనని విమర్శించారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని.. కాంగ్రెస్ కూడా అలాగే అవుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డిలా లాలూచీ పనులను సీఎం కేసీఆర్ …
Read More »బండి సంజయ్.. ఆర్డీఎస్ ఎలా పూర్తిచేస్తావో చెప్పగలవా?: నిరంజన్‌రెడ్డి సవాల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కొన తెలియదు.. మొన తెలియదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరునెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తిచేయగలవో కాగితంపై రాసిస్తావా అని సంజయ్‌కు మంత్రి సవాల్ విసిరారు. ఎక్కడి నుంచి నిధులు తెస్తోవో చెప్పగలవా? అని ప్రశ్నించారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతల …
Read More »ఆయనలా హామీలు చెత్తబుట్టలో పడేస్తే ఏపీ అమెరికా అవుతుందా?
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లంచాలకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని చెప్పారు. ఒంగోలులో ‘వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ’ నిధులు విడుదల చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో …
Read More »కేసీఆర్ పడే తపన.. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఉంటుందా?: కేటీఆర్
వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్‌జీ గ్యాస్ లైన్‌ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు సుమారు 43 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు …
Read More »అనిల్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి కాకాణి
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయనే వార్తల నేపథ్యంలో సీఎం వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలను వారిద్దరూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జగన్‌తో భేటీ అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. అనిల్ యాదవ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. తమ మధ్య …
Read More »వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు వీళ్లే..
వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఇటీవల మంత్రి పదవులు దక్కని వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి అవకాశం కల్పించారు. తొలి నుంచీ పార్టీకి సేవలందించిన వారితో పాటు మరికొందరికి ఇందులో చోటు కల్పించి గౌరవించారు. జిల్లా అధ్యక్షులు రీజినల్ కోఆర్డినేటర్లు
Read More »దళితబంధుతో అనుకున్నదానికంటే ఎక్కువ లబ్ధి: కేసీఆర్
అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు పథకం మరింత వేగంగా చేరేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ పథకం కింద క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం కార్యదర్శి రాహుల్‌బొజ్జా కేసీఆర్‌కు వివరించారు. రోజుకు 400 మంది చొప్పున ఇప్పటివరకు 25వేల అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు అందించామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌మాట్లాడుతూ ప్రభుత్వం ముందుగానే దళితబంధు నిధులను విడుదల చేసిందని.. అర్హులను గుర్తించి వాటిని అందివ్వడంలో ఆలస్యం …
Read More »ఏపీలో జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు వీళ్లే..
ఏపీ ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. ఇటీవల ఏర్పాటు చేసిన 26 కొత్త జిల్లాల ఆధారంగా ఇన్‌ఛార్జులను నియమించారు. అయితే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కలిపి ఒకే మంత్రికి బాధ్యతలు అప్పగించింది. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులు.. శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ విజయనగరం – బూడి ముత్యాలనాయుడు అల్లూరి, పార్వతీపురం మన్యం- గుడివాడ అమర్‌నాథ్ విశాఖ – విడదల రజని అనకాపల్లి – పీడిక …
Read More »