ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని.. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్‌తో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌కోఆర్డినేటర్ల సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని జగన్ ఆదేశించారన్నారు. వచ్చే నెలలో ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాలను తిరిగి సమస్యలను అక్కడి బుక్‌లో రాయాలని.. వాటిని తాను పరిష్కరిస్తానని …
Read More »టీఆర్‌ఎస్ పార్టీకి బ్యాంకుల్లో ఉన్న డబ్బు ఎంతో చెప్పిన కేసీఆర్
దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉందని.. అందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సభలో ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ఒక లక్ష్యంతో పనిచేస్తే అమెరికాను మించిన ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 90కి పైగా స్థానాలు టీఆర్‌ఎస్‌వేనని.. ఈ విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ప్రసంగంలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీకి …
Read More »గేర్ మారుస్తున్నాం.. సిద్ధంగా ఉండండి: జగన్
మనమంతా ఒకటే కుటుంబమని.. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ నిర్దేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతో కాదని.. ఎల్లో మీడియాతో అని సీఎం పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియా తీరును …
Read More »కొత్త రాజకీయ శక్తి అవసరం.. ప్లీనరీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
దేశంలో స్వాతంత్య్ర ఫలాలు లభించాల్సిన పద్ధతిలో ప్రజలకు అందలేదని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. అనవసర పెడధోరణులు దేశంలో ఎక్కువ అవుతున్నాయని.. ఇలాంటి దురాచారాలు, దురాగతాలకు స్థానం ఉండకూడదని చెప్పారు. దేశ పరిరక్షణ కోసం ప్రజలంతా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగించారు. ప్లీనరీ వేదికపై తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం …
Read More »కాంగ్రెస్‌కు షాక్.. హ్యాండిచ్చిన ప్రశాంత్ కిషోర్..!
కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) చేరిక ఖాయమైందనుకున్న సమయంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మరో వైపు ఇదే విషయంపై కాంగ్రెస్ ముఖ్యనేత రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ కోరినా పీకే తిరస్కరించారని తెలిపారు. పార్టీలో చేరి …
Read More »మొదటి 20లో 19 తెలంగాణ గ్రామాలే.. కంగ్రాట్స్ సీఎం గారూ: కేటీఆర్ ట్వీట్
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశవ్యాప్తంగా మొదటి 10 స్థానాలతో పాటు మొదటి 20లోనూ 19 తెలంగాణ గ్రామాలే ఉండటం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లె ప్రగతి లాంటి ప్రత్యేక కార్యక్రమాలు అమచేస్తున్న సీఎం కేసీఆర్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందానికి అభిందనలు తెలిపారు. …
Read More »సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కమిటీ
సీపీఎస్‌రద్దు అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, సీఎస్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడం.. పలుచోట్ల నిరసనలు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన, విద్యాశాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ మంత్రి …
Read More »రేవంత్ ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి: పువ్వాడ అజయ్
మమత మెడికల్ కాలేజ్‌లో 20 ఏళ్లుగా పీజీ ప్రవేశాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పీజీ మెడికల్ సీట్ల ఆరోపణలపై గవర్నర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పువ్వాడ మీడియాతో మాట్లాడారు. రేవంత్ ఫిర్యాదు చేయడాన్ని ఆయన ఖండించారు. సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరం మాకు లేదని.. ఒక్క సీటైనా బ్లాక్‌చేసినట్లు నిరూపిస్తే ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని మంత్రి సవాల్ …
Read More »చంద్రబాబు, బొండా ఉమా హాజరుకావాల్సిందే: వాసిరెడ్డి పద్మ
టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా కమిషన్‌ను తూతూ మంత్రంగా నడిపారని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అడ్డుకున్న వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమకు మహిళా కమిషన్ ఛైర్మన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బొండా ఉమ విమర్శలు గుప్పించారు. మహిళా కమిషన్ సుప్రీమా? అంటూ బొండా ఉమ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో …
Read More »బండి సంజయ్.. నీకు దమ్ముంటే ఆ నిధులు రప్పించు: హరీశ్ సవాల్
తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం ఏదో నిధులు ఇచ్చేస్తున్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు. తెలంగాణ నిధులతో బిహార్, చత్తీస్‌గఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీ నేతలు ఉల్టా మాటలు కప్పిపెట్టి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.7,183కోట్లు …
Read More »