Home / POLITICS (page 63)

POLITICS

దేశంలో త్వరలో ఒక సంచలనం జరుగుతుంది: కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలను కేసీఆర్‌ సందర్శించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. కేసీఆర్‌కు దగ్గరుండి ఆ పాఠశాలను చూపించారు. ఈ సందర్భంగా అక్కడ కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. పొలిటికల్‌ లీడర్లు కలిసినపుడు పాలిటిక్స్‌ గురించే మాట్లాడుకుంటారన్నారు. దేశంలో …

Read More »

నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ..: వల్లభనేని వంశీ

తనతో ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ చెప్పారు. వైసీపీలో తనకెలాంటి సమ్యలూ లేవని.. ఎవరికైనా ఇష్యూ ఉంటే వారే చూసుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో విభేదాల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పారు. ఎవరి మనోభావాల ప్రకారం వారు నడుచుకుంటారని.. గత రెండు ఎన్నికల్లో …

Read More »

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ: పవన్‌

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మృతిచెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థికసాయం అందించారు. వలిగొండ మండలం గోకారం, కోదాడలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కోదాడలో మీడియాతో పవన్‌ మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 5వేలకు పైగా ఓట్లు ఉన్నాయన్నారు. ఆ ఓట్లతో గెలవలేనప్పటికీ రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని …

Read More »

బీబీ నగర్‌ ఎయిమ్స్‌పై కిషన్‌రెడ్డి దృష్టిపెట్టాలి: హరీశ్‌రావు

బీబీ నగర్‌ ఎయిమ్స్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పలుమార్లు సందర్శించినా ఇక్కడి సదుపాయాలపై కేంద్రాన్ని ఏనాడూ అడగలేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఎయిమ్స్‌ నిర్మాణానికి భూములు, భవనాలు ఇచ్చి అన్నిరకాలుగా సహకారం అందించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు ఉపయోగం కలగడం లేదన్నారు. బీబీ నగర్‌ ఎయిమ్స్‌కు హరీశ్‌రావు పరిశీలించి అందుతున్న వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం …

Read More »

ప్రజలకు ఏం చేశామో బస్సు యాత్రలో చెప్తాం: ధర్మాన

దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అందిస్తున్న ప్రభుత్వం తమదని వైసీపీ సీనియర్‌ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన మంత్రులు వైఎస్సార్‌ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ‘సామాజిక న్యాయం’ అనే పేరుతో …

Read More »

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ.. ఆశావహులు వీళ్లే!

టీఆర్‌ఎస్‌ పార్టీలో రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బండ ప్రకాశ్‌ రాజీనామాతో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి రేపటిలోపు నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థిని ప్రకటించేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావుకు రాజ్యసభ …

Read More »

తీన్మార్‌ మల్లన్నకు మంత్రి పువ్వాడ అజయ్‌ షాక్‌!

తీన్మార్‌ మల్లన్నకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ షాక్‌ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మల్లన్నకు న్యాయవాదితో మంత్రి లీగల్‌ నోటీసు పంపించారు. ఏప్రిల్‌ 17న మల్లన్న తన యూట్యూబ్‌ ఛానల్‌లో మంత్రి అజయ్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తరఫు లాయర్‌ లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి పరువుకు భంగం కలిగించినందున వారంలోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి తరఫున న్యాయవాది మల్లన్నను డిమాండ చేశారు. అంతేకాకుండా …

Read More »

వైసీపీ రాజ్యసభ టికెట్లు ఫైనల్‌.. అభ్యర్థులు వీళ్లే..

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్‌ చేసింది. ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశం కల్పించారు. అనూహ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యను వైసీపీ హైకమాండ్‌ ఎంపిక చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, ప్రముఖ న్యాయవాది నిరంజన్‌రెడ్డికి ఆ పార్టీకి అధినేత, సీఎం జగన్‌ ఎంపిక చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం …

Read More »

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్‌పై చంద్రబాబు ఆగ్రహం

సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ప్రజాదర్భార్‌ నిర్వహించగా.. అక్కడికి జూనియర్‌ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నేత, ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి వెళ్లాడు. అతన్ని చూసిన చంద్రబాబు పీఏ.. చంద్రబాబుకు శివ గురించి చెప్పాడు. కుప్పంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ …

Read More »

హైదరాబాద్‌ ప్రజలకు ఇది శుభకార్యం..కేసీఆర్‌కు రుణపడి ఉంటాం: కేటీఆర్‌

ఓఆర్‌ఆర్‌ మాత్రమే కాదని.. ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చినా అక్కడి వరకు నీళ్లు అందించేలా సుంకిశాల ప్రాజెక్టు డిజైన్‌ రూపొందించామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని దీని నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లా సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌వెల్‌ ప్రాజెక్టుకు మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులతో కలిసి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat