Home / POLITICS (page 60)

POLITICS

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: పెద్దిరెడ్డి

కుప్పంలో మైనింగ్‌ మాఫియా జరుగుతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడుతుందనే ఆయన అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన సామాజిక భేరి ముగింపు సభ విజయవంతమైందని ఆయన చెప్పారు. 2024లో జరిగే ఎన్నికలే చంద్రబాబుకు చివరివని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయభేరి ముగింపు …

Read More »

టీడీపీకి ఎంతో సేవ చేశా.. అయినా నన్ను అవమానించారు: దివ్యవాణి

పార్టీ కోసం ఎంతో చేసినా తనను తీవ్రంగా అవమానించారని సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా ఆమె ప్రకటించారు. కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడితే కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందన్నారు. మహానాడు వేదికగా తనను అవమానించారని ఆరోపించారు. ఒక కళాకారుడు (ఎన్టీఆర్‌) స్థాపించిన పార్టీలో కళాకారులు …

Read More »

తెలంగాణలో 2.5లక్షల ఎకరాల్లో ఆలుగడ్డలు పండించాలి: నిరంజన్‌రెడ్డి

తెలంగాణలో తినేందుకు ఆలుగడ్డను అధికమొత్తంలో వినియోగిస్తారని.. ఇక్కడ ప్రజల అవసరాలకు సరిపోయేలా ఉండాలంటే 2.5లక్షల ఎకరాల్లో పండించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వానాకాలం పంటలసాగుపై సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేవలం ఐదారు వేల ఎకరాల్లోనే ఆలుగడ్డలను పండిస్తున్నారని.. అందుకే యూపీ, గుజరాత్, పంజాబ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. 65 నుంచి 70 రోజుల్లోనే ఆలు …

Read More »

నా హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర: మంత్రి మల్లారెడ్డి

తనను హత్య చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని.. అందుకే రెడ్ల సింహగర్జన సభలో దాడికి యత్నించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని.. రేవంత్‌రెడ్డి నేరాలపై విచారణ జరిపి జైల్లో పెడతామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ పథకాలు రెడ్లకు అందుతున్నాయని తాను చెప్పానన్నారు.

Read More »

టీఆర్‌ఎస్‌ ఎంపీగా గాయత్రి రవి ప్రమాణస్వీకారం

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ సచివాలయంలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి కడియం శ్రీవారి, టీఆర్ఎస్‌ నేతలు గాయత్రి రవికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలన్నీ అమలయ్యేవరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం ఆపేది లేదన్నారు. తెలంగాణపై …

Read More »

రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తా: సీఎం జగన్‌

సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసి, వైకాపా ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జగన్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు కృజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు …

Read More »

ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా చంద్రబాబుకు లాభం లేదు: అంబటి

బడుగు, బలహీనవర్గాల పక్షపాతి సీఎం జగన్‌ అని.. వారికి ఆయన సామాజిక న్యాయం చేశారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అంబటి మాట్లాడారు. బస్సు యాత్రకు ప్రతి చోటా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా లాభం లేదని.. …

Read More »

అదీ జగన్‌ ఫేస్‌ వేల్యూ..: ఏపీ మంత్రి ఆర్కే రోజా

టీడీపీ మహానాడులో బూతు పురాణాలు తప్ప ఏమైనా చర్చించారా అని ఏపీ మంత్రి రోజా ప్రశ్నించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సీఎం జగన్‌ను విమర్శించడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేతలు పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, టీడీపీకి చంద్రబాబు శని అని.. ఈ మాటలను స్వర్గీయ ఎన్టీఆరే స్వయంగా …

Read More »

ఆరోజు నుంచే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి..: మంత్రి మల్లారెడ్డి

రానున్న దసరా రోజు నుంచి దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్‌ వెళ్తారని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఆయనకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దసరా రోజున వరంగల్‌లని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి నేషనల్‌ పాలిటిక్స్‌లో కేసీఆర్‌ అడుగుపెడతారని చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించి కార్మిక సదస్సులో మల్లారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకాన్ని …

Read More »

మోడీ పనిచేస్తోంది దేశం కోసమా? దోస్తుల కోసమా?: బాల్క సుమన్‌

దేశచరిత్రలో మోడీలాంటి అసమర్థ ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విమర్శించారు. ఆయన నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్‌ మాట్లాడారు. కరోనా సమయంలో అసమర్థ పాలనను ప్రపంచమంతా చూసిందన్నారు. తెలంగాణకు మోడీ పచ్చి వ్యతిరేకి అని సుమన్‌ ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులు ప్రజలతో నేరుగా ఎన్నికయ్యారని.. తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat